విద్యార్థినులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

రాజోలు బాలికల వసతిగృహంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

రాజోలు పట్టణంలోని సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతిగృహంలో రాజోలు నియోజకవర్గానికి చెందిన విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన నిత్య వినియోగ వ్యక్తిగత సామగ్రి, నిత్యావసర వస్తువులను రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థినుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పోషకాహారం, భద్రత మరియు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం, ప్రతి సౌకర్యం అర్హులైన విద్యార్థినులకు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, వసతిగృహ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.