రాజమండ్రిలో పవన్ కళ్యాణ్‌ను కలిసిన రెడ్డి అప్పల నాయుడు

రాజమండ్రి లోని షెల్టన్ హోటల్‌లో ఈరోజు నిర్వహించిన జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలు మరియు నియోజకవర్గ స్థాయి కార్యాచరణపై నాయకులతో సమీక్ష జరిగినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.