సిమెంట్ ఫ్యాక్టరీ అంటేనే కాలుష్యం..దుమ్ము..దూళీ..
భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏమన్నా ఆక్సిజన్ వదులుతుందా? దుమ్మూ, ధూళేగా?
కరోనా విపత్తుల్లో జనం ఆర్దికంగా నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే సుమారు 3 వేల మంది కార్మికులని రోడ్డు మీద పడేయడం ఏంటో!!. నోటీసులు ఇచ్చి పరిష్కరించే సమస్యకి మూసేయండి అని ఆదేశాలు ఏంటో!!
ఎంత వరకు నిజమో కాని మాకు అమ్మేసి మేము ఇచ్చింది తీసుకుపోండి అని జగన్ రెడ్డి పరివారం హుకుం జారీ చేస్తే, యాజమాన్యం అమ్మము అంటే, కాలుష్యం అని మూసేపించి దానిని తప్పక తమకే అమ్మేలా చేసారు అని కొందరు అంటున్నారు. నిజా నిజాలు జగన్ రెడ్డి పరివారానికి, జూవారి సిమెంట్ యాజమాన్యానికే తెలియాలి..
రాష్ట్రంలో ఉన్న ఒక్కో పరిశ్రమని కాలుష్యం అని ఇంకోటి అని మూసేస్తే..వాటి స్తానంలో సొంత పరిశ్రమలు పెట్టుకోవచ్చు..జూవారి సిమెంట్ మూసేపిస్తే దానిని తప్పక అమ్ముతారు..అప్పుడు కారు చవకగా కొనుక్కోవచ్చు.
వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు కాని అక్రమంగా అధికారాన్ని వాడుకుని ఇతర వ్యాపారులని దెబ్బతీసి వారిని నష్టపరిచి వారి కంపినీలు లాక్కోవడం వ్యాపారం అనరు..
గుజరాత్ నుండి వచ్చిన అమూల్ అనే సంస్త పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారం చేసుకోవచ్చు ఎవరూ తప్పు పట్టరు కాని ప్రభుత్వమే ప్రోత్సహించడం, గ్రామ స్తాయిలో అమూల్ కే పాలు పోయాలని ఒత్తిడి తేవడం, చిన్నా చితకా డైరీలని లేకుండా చేయాలని చూడటం ఏంటో!!
గతంలో చంద్రబాబు నాయుడు చిత్తూరు డైరీ సమాధి మీద హెరిటేజ్ ని నిర్మించారు, అప్పుడు..ఇప్పుడు జగన్ రెడ్డిది అదే ధోరణి.