మిచౌం గ్ తుఫాను నష్టపోయిన రైతాం గానికి పరి హారం చెల్లించాలి : గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె , మిచౌంగ్ తుఫాను బాధితులను ఆదుకోవాలని జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టి పల్లి వద్ద జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, పట్టణ అధ్యక్షులు జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రూరల్ ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్, రెడ్డె మ్మ, నవాజ్, జనార్దన్ తదితరులతో కలిసి వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీ నర్ గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ తుపాను తీవ్ర నష్టాలను మిగిల్చిందని, పంటలపై తీవ్ర ప్రభావం చూపి , రైతుల వెన్ను విరిచిందని వ్యక్తం చేశారు. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా వర్షాలు కొనసాగుతున్నాయని అన్నారు. రైతులు పొలాల్లోని పంట పరిస్థితిని చూసి రైతులు కన్నీ రుము న్నీ రు అవుతున్నా రని వివరిం చారు. మదనపల్లె నియోజకవర్గంలో టమోటా , వరి, ఇతర వాణిజ్య పంటలు పండిస్తు న్న రైతులు అపార నష్టం చవి చూశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి చిత్తూ రు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వేలాది ఎకరాలలో వరి, బొప్పా యి, అరటి , జొన్న , మొక్కజొన్న , రాగి తోపాటు వంకాయ, టమోటా , బెం డ, బీన్స్ తదితర కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతోటలు దె బ్బ తిన్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. ము ఖ్యం గా అన్న మయ్య జిల్లాలో ని మదనపల్లె , పీలేరు, రాజంపేట, రాయచోటి , కోడూరు, తంబళ్లపల్లె నియోజకవర్గా లలో అపార నష్టం వాటిల ్లిం దన్నా రు. సాగు చేసిన పంటలో 80 శాతం పైగా నష్టం వాటిల ్లిం దన్నా రు. అధికార పార్టీకి చెం దిన ప్రజాప్రతినిధులు స్పందించి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిం చే విధంగా ము ఖ్యమంత్రిపై ఒత్తి డి తేవాలని డిమాం డ్ చేశారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థా యిలో పరిశీలన జరపకుండా తూ తూ మంత్రం గా రిపోర్ట్ రె డి చేసి ఇవ్వకుండా క్షేత్ర స్థా యి పరిశీలన చేసి రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లిం చాలని డిమాం డ్ చేశారు. రైతులకు క్రాప్ ఇన్సూరె న్స్ పై అవగాహన కల్పిం చాలని సూ చిం చారు. పాడైపోయిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కోత కోసిన పంట వర్షా లకు తడిచి పాడైపోయిం దన్నా రు. ఇప్పటి కే కళ్లాల్లో ఉన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో అలసత్వం , నిర్లక్ష్యం వహిం చడం వల్ల వేలాది ఎకరాల్లో పంట నీ ట ము నిగిం దని రైతులు కన్నీ రు ము న్నీ రవుతున్నా రని అన్నా రు . ప్రభుత్వం ప్రకటించి న మద్దతు ధరలను అందించి రైతులను ఆదుకోవాలని, వర్షం నీటిలో పంట కొట్టు కుపోయిన ప్రాం తాల్లో రైతులకు ప్రభుత్వం పంటనష్ట పరిహారం అందిం చాలని కోరారు. ప్రభుత్వం తక్ష ణమే స్పందించి నష్టపోయిన రైతాం గాన్ ని ఆదుకోవాలని లేనిపక్షంలో జనసేన పార్టీ తరఫున ప్రత్యక్ష కార్యా చరణకు దిగు తామని హెచ్చరిం చారు. రైతులకు జరిగి న నష్టాన్ ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యా ణ్ దృష్టికి తీసుకువె ళ్ళి ప్రభుత్వం పై ఒత్తి డి తీసుకు వచ్ చే విధంగా చేస్తా మని తెలి పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూ రు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం , పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రూరల్ ఉపాధ్యక్షులు చంద్ర శేఖర, పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డె మ్మ, రూరల్ ప్రధాన కార్యదర్శి నవాజ్, కార్యదర్శి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.