బీసీల అభ్యున్నతికి జనసేన సహకారం ఇస్తుంది

మదనపల్లె: రాష్ట్రంలో బిసికుల జనగణనను పారదర్శకంగా చేపట్టి, రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కులను కల్పించాలని బీసీకుల జనగణన రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీ నర్ పునరుద్ఘాటిం చారు. ఆదివారం మదనపల్లె టౌన్ బెంగళూరు రోడ్డు, నక్కలదిన్నె షటిల్ కోర్టులో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు పులి శ్రీనివాసులు ఆధ్వర్యం లో బిసి కుల జనగణన అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీ నర్ గంగారపు రామదాస్ చౌదరి ఆద్వర్యం లో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు . ఈ
సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీ నర్ గంగారపు రామదాస్
చౌదరి మాట్లాడుతూ బీసీలకు తీవ్ర అన్యా యం జరుగుతోందన్నారు . దీనిని
దృష్టిలో ఉంచుకొని తమ హక్కుల సాధన కోసం ఐకమత్యంతో ముందుకు
సాగాలన్నారు . అడవులలో జంతువులకు గణాంకాలు ఉన్నా యని, కాని దేశ
వ్యాప్తంగా బిసిల కుల జనగణన లేకపోవడం అన్యా యమన్నారు . రాయలసీమ జిల్లాలలో 32 నియోజకవర్గాలలో వాల్మీకుల ప్రభావం వుం దని, నీలం సంజీవరెడ్డి కంటే ముం దు
వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నారన్నారు . రాజకీయంగా వారిని అణగదొక్కడానికి‌ బిసిలుగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మీకి రిజర్వే షన్ల అంశాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి
మద్దతునిస్తామన్నారు . జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ బిసి కుల జనగణనను స్వాగతిస్తున్నా మని, అయినా ప్రభుత్వం
పారదర్శకంగా నిర్వహిస్తుం దనే నమ్మకం లేదన్నారు . కేం ద్ర,రాష్ట్ర ప్రభుత్వా లు బిసి కుల జన గణన పారదర్శకంగా జరపాలన్నారు . వైసిపి ప్రభుత్వం నిజంగా బిసి కుల జనగణన
చేయాలని భావిస్తే పారదర్శకంగా చేపట్టాలన్నారు . వైసిపి ప్రభుత్వం ఎన్నికల కోసమే బిసి కుల జనగణన చేపట్టడం జరిగిందే తప్ప బిసిలకు అండగా నిలబడడానికి కాదని విమర్శించారు.
అడపా సురేంద్ర, నాయుని జగదీష్ బిసి కుల జనగణనపై తమ సూచనలు సలహాలు అందిం చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం , రాష్ట్ర
చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా జాయిం ట్ సెక్రటరీ గజ్జల రెడ్డెప్ప, టౌన్ ప్రెసిడెం ట్ నాయని జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ, చంద్రశేఖర, గడ్డం
లక్ష్మిపతి, జవిలి మోహన్ కృష్ణ, నవాజ్, కుమార్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.