జనసేన – టీడీపీ జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు ప్రారంభం

తొలి రోజు ఐదు ఉమ్మడి జిల్లాల్లో సమన్వయం
సంయుక్తంగా ప్రజా పోరాటాలు చేపట్టాలని నిర్ణయం
ఇసుక, మట్టి, మద్యం, గనులు… అన్నిట్లో వైసీపీ దోపిడీని ప్రజలకు వివరిద్దాం
కరవు ఛాయల నేపథ్యంలో రైతులకు అండగా నిలవనున్న ఉభయ పక్షాలు
• ఇంటింటికీ ఉమ్మడి మేనిఫెస్టో తీసుకువెళ్దామన్న నేతలు
• శ్రీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, వారాహి యాత్రకు అడ్డంకులకు ఖండన

జనసేన – తెలుగుదేశం పార్టీ జిల్లాల వారి సమన్వయ సమావేశాలు ఆదివారం ప్రారంభం అయ్యాయి. ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో సమావేశాలు ఆత్మీయ వాతావరణంలో సాగాయి. ఇరు పార్టీల జిల్లా ఇంఛార్జుల అధ్వర్యంలో రాష్ట్రస్థాయి పరిశీలకుల సమక్షంలో జిల్లాల వారీగా ముఖ్యనేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి అనంతపురం, ప్రకాశం, తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొదటి రోజు సమావేశాలు నిర్వహించారు. ఒకరికి ఒకరు పరిచయాలు చేసుకుంటూ ఆత్మీయంగా పలుకరించుకున్నారు.
సుహృద్భావ వాతావరణంలో సాగిన సమావేశాల్లో పొత్తు ఆవశ్యకత మీద ప్రధానంగా చర్చ సాగింది. జనసేన – తెలుగుదేశం పార్టీల కలయిక చారిత్రక అవసరం అంటూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇరు పార్టీల నేతలు ముక్తకంఠంతో స్వాగతించారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఉమ్మడి మేనిఫెస్టోని నవంబర్ 1వ తేదీ నుంచి ఇంటింటికీ తీసుకువెళ్లే అంశం మీద, తీవ్ర వర్షా భావ పరిస్థితుల నేపధ్యంలో ఎండిపోతున్న పంటలు, క్షేత్ర స్థాయి పర్యటనలు, కరవు నెలకొన్నరీత్యా రైతులకు అండగా నిలిచే అంశాల మీద చర్చ సాగింది. తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రకు అడ్డంకులు కల్పిస్తున్న అంశాలను జిల్లా స్థాయి సమన్వయ సమావేశాల్లో ఇరు పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. భవిష్యత్ కార్యచరణ, సమస్యలపై పోరాటం తదితర అంశాలపై ఇరు పార్టీల ముఖ్యనేతలు దిశానిర్ధేశం చేశారు. జనసేన – టీడీపీ జిల్లా స్థాయి నాయకత్వాన్ని సమన్వయ పర్చే క్రమంలో సాగిన ఈ సమావేశాలు విజయవంతంగా పూర్తయ్యాయి.

• ఉమ్మడి అనంతపురం జిల్లాల్…

జనసేన – టీడీపీ జిల్లాల సమన్వయ సమావేశంలో భాగంగా ఆదివారం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఇరు పార్టీల నేతలు సమావేశం అయ్యారు. అనంతపురం, శ్రీ బల్లా కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ సమావేశానికి ఇరు పార్టీల జిల్లాల అధ్యక్షులు శ్రీ టీసీ వరుణ్, శ్రీ కాల్వ శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఇరు పార్టీల పరిశీలకులు శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, శ్రీ ఎన్.ఎం.డి.ఫరూక్, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్రెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ పార్ధసారథి, శ్రీ పయ్యావుల కేశవ్, ఇరు పార్టీల రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు, నియోజకవర్గస్థాయి నాయకులు పాల్గొన్నారు. పొత్తును ముందుకు తీసుకువెళ్లే అంశం, ఉమ్మడి అనంత జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో విజయం సాధించే దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు. నియోజకవర్గాల వారీగా ఇరు పార్టీల నాయకుల మధ్య సమన్వయం చేయడంతో పాటు క్షేత్ర స్థాయి పర్యటనలు ముందుకు తీసుకువెళ్లే అంశాలపై సీనియర్ నాయకులు సూచనలు చేశారు. ఇరు పార్టీల నేతల మధ్య భేదాభిప్రాయాలు తెచ్చే విధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

• ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్..

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన – తెలుగుదేశం పార్టీల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ
సమావేశం జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో జరిగింది. ఇరు పార్టీల పరిశీలకులు శ్రీ బొమ్మడి
నాయకర్, శ్రీమతి వంగలపూడి అనితల ఆధ్వర్యంలో సాగిన ఈ సమావేశంలో పార్టీ శ్రీకాకుళం
జిల్లా కో ఆర్డినేటర్ శ్రీమతి పాలవలస యశస్వి, పార్లమెంటు సభ్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు,
పార్లమెంటరీ ఇంఛార్జ్ శ్రీ కూన రవికుమార్, ఇచ్ఛాపురం శాసనసభ్యులు శ్రీ బెందాలం అశోక్,
ఇరు పార్టీల ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు, వివిధ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య
నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో పరిస్థితులు, వలసలు, ప్రజా పోరాటాలు తదితర అంశాలపై
అజెండాల వారీగా చర్చించారు. పొత్తు పట్ల ఇరు పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారు.

• ఉమ్మడి విజయనగరం జిల్లాల్..

ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన – టీడీపీ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం విజయనగరంలోని మౌర్య హోటల్ లో జరిగింది. ఇరు పార్టీల పరిశీలకులు శ్రీ కోన తాతారావు,
శ్రీ బుద్ధావెంకన్నల సమక్షంలో సాగిన ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా సమన్వయకర్త శ్రీమతి లోకం నాగ మాధవి, పీఏసీ సభ్యురాలు శ్రీమతి పడాల అరుణ, టీడీపీ నుంచి మాజీ
కేంద్ర మంత్రి శ్రీ ఆశోక గజపతిరాజు, విజయనగరం జిల్లా టీడీపీ ఇంఛార్జ్ శ్రీ కిమిడి నాగార్జున, శ్రీమతి సంధ్యారాణి, శ్రీ మంజిదేవ్, శ్రీ ఐ.వి.పి. రాజు, శ్రీ పతివాడ నారాయణస్వామి
నాయుడు, జనసేన నాయకులు శ్రీమతి తుమ్మి లక్ష్మి రాజ్, శ్రీ గిరడా అప్పలస్వామి, శ్రీ
గురాన అయ్యలు, శ్రీ అదాడ మోహన్, శ్రీ మర్రాపు సురేష్ తదితరులు సమావేశంలో
పాల్గొన్నారు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గురించి
చర్చించారు. తోటపల్లి రిజర్వాయర్ నుంచి రైతులకు సాగు నీరు అందటం లేదనీ,
వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బ తిన్నాయని ఉభయ పక్షాలు గుర్తించాయి.
దీనిపై సంయుక్తంగా పోరాడి రైతులకు అండగా నిలవాలని నిర్ణయించారు. అదే
విధంగా జిల్లావ్యాప్తంగా పోరాడాల్సిన ప్రధాన ప్రజా సమస్యలపై ఇరు పార్టీల నేతలు
చర్చించారు.

• ఉమ్మడి ప్రకాశం జిల్లాల్…

జనసేన – తెలుగుదేశం పార్టీల జిల్లా స్థాయి సమన్వయ సమావేశాల్లో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు ఒంగోలు, ఎంజీ ఫంక్షన్ హాల్లో భేటీ అయ్యారు. ఇరు పార్టీల
పరిశీలకులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జనసేన జిల్లా ఇంఛార్జ్ శ్రీ షేక్ రియాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీ పెదపూడి విజయ్ కుమార్,
రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఆమంచి స్వాములు, క్రియాశీలక సభ్యుల శిక్షణ విభాగం ఛైర్మన్ శ్రీ ఈదర హరిబాబు, టీడీపీ పార్లమెంటు ఇంఛార్జ్ శ్రీ నూకసాని బాలాజీ, శ్రీ దామచర్ల జనార్ధన్,
పర్చూరు, అద్దంకి, కొండేపి ఎమ్మెల్యేలు శ్రీ ఏలూరి సాంబశివరావు, శ్రీ గొట్టిపాటి రవికుమార్, శ్రీ డోలా బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్, జిల్లాకు చెందిన ఇరు
పార్టీల రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధాన సమస్య అయిన తాగు, సాగు నీరు, వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో ఎదురయ్యే
ఇబ్బందులు, ప్రజల పక్షాన చేయాల్సిన పోరాటాలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన – టీడీపీ కూటమి గెలుపు కోసం అనుసరించాల్సిన
వ్యూహాలపై ఈ సమావేశం చర్చించింది. గనుల ఆదాయాన్ని వైసీపీ దోచేస్తుందని, గనుల ద్వారా వచ్చే రాబడిని జిల్లా అభివృద్ధికే కేటాయించేందుకు రెండు పార్టీలు కట్టుబడి ఉంటాయని
ఈ సమావేశంలో నిర్ణయించారు.

• ఉమ్మడి తూరుపు గోదవరి జిల్లాల్…

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సమన్వయ సమావేశాన్ని కాకినాడలో నిర్వహించారు. జనసేన పక్షాన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టి.శివశంకర్, టీడీపీ పక్షాన పొలిట్ బ్యూరో సభ్యులు
శ్రీ కొల్లు రవీంద్ర సమక్షంలో ఈ సమావేశంలో సాగింది. శ్రీ కందుల దుర్గేష్, శ్రీ జ్యోతుల నవీన్ నేతృత్వం వహించారు. ఉమ్మడి కార్యాచరణలో భాగంగా పార్టీ ఇచ్చే కార్యక్రమాలను
విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించారు. క్షేత్ర స్థాయిలో ఇరుపక్షాలు సుహృద్భావ వాతావరణంలో పని చేస్తాయని ఉభయ పక్షాల నాయకులు వెల్లడించారు. ఇసుక, మట్టి,
మద్యం, గనులు… ఇలా ప్రతిచోటా వైసీపీ దోపిడీ సాగిస్తోందని – ఈ దోపిడీని ప్రజలకు వివరించడంతోపాటు పోరాటం సాగించాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జనసేన
పీఏసీ సభ్యులు శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పంతం నానాజీ, శ్రీ పితాని బాలకృష్ణ, టీడీపీ నుంచి మాజీ మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు, శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, శ్రీ కె.ఎస్.జవహర్
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.