కాకినాడ సిటి: ముత్తా నగర్ వినాయకుడు గుడి, అంబేద్కర్ బొమ్మ దగ్గర దుగ్గన బాబ్జి ఆధ్వర్యంలో సత్యన్నా రాయణ ఇంటి నందు కాకినాడ జనసేన పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ చే క్రిస్మస్ కేక్ కటింగ్ కార్య క్రమం జరిగింది. ఈ సందర్భంగా అక్కడి ప్రాంత క్రిస్టియన్ సోదర సోదరీ మణుల కుటుంబాలతో కలిసి ముత్తా శశిధర్ ప్రార్ధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరుణ, జాలి, ప్రేమ ఇవన్నీ అందరిపై చూపిస్తూ నడుచుకోవాలని బైబిల్ మనకి నిర్దేశిస్తోందనీ మనమందరం అది ఆచరించి ఆ ప్రభువు ప్రేమకు పాత్రులమవ్వాలని ఆకాంక్షించారు. ఇతరులకి సహాయం అందించడంలోనే దేవుని పట్ల నమ్మకాన్ని తెలియచేయడం అనీ, ఈ క్రిస్మస్ పండుగ దీ నుల జీవితాల్ లో వెలుగులు నిం పాలని ప్రార్ధించారు. ఈ కార్య క్రమంలో దుగ్గన బాబ్జీ , సత్యన్నా రాయణ మరియు వారి కుటుం బ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు జనసేన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.