• ప్రతి ఒక్కరికీ అండగా నిలబడాలన్నది ఏసు క్రీస్తు అందించే స్ఫూర్తి
• తెనాలి జనసేన కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
• క్రైస్తవ సోదరులకు శుభాకాం క్షలు తెలిపిన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెం డ్ల మనోహర్
![](http://kingofandhra.com/wp-content/uploads/2023/12/image-135-1024x687.png)
సర్వమత సమానత్వం జనసేన పార్టీ విధానమని, ప్రతి మానవుడి కోసం ఏసు క్రీస్తు ఎలా నిలబడ్డారో అలాగే తాము కూడా అండగా నిలబడతామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ప్రతి మానవుడిలో ప్రేమ, క్షమాగుణం అలవడాలన్న క్రీస్తు ఆలోచనా విధానం నిత్య ఆచరణీయమని తెలిపారు. శనివారం సాయంత్రం తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. ఈ వేడుకల్లో శ్రీ మనోహర్ గారు సతీసమేతంగా పాల్గొని క్రైస్తవ మత పెద్దలతో కలసి కేక్ కట్ చేశారు. క్రైస్తవ సోదర సోదరీ మణులకు శుభాకాం క్షలు తెలియచేశారు. ఈ కార్య క్రమంలో పాల్గొన్న దైవ జనులు బిషప్ శ్రీ ప్రభుదాస్, శ్రీ బాబురా వు, శ్రీ గాబ్రెల్ , శ్రీ డి.శామ్యూ ల్ , శ్రీ స్ టీఫెన్, శ్రీ ఎం.షాలెం రా జు, శ్రీ ఎబ్నై జర్, శ్రీ ఐజాక్, శ్రీ బి. కరుణాకర్, శ్రీ గిద్ది యోన్ లు ప్రత్యే క ప్రార్ధనలు జరిపి, బైబిల్ సందేశాన్ని అందిం చారు. శ్రీ మనోహర్ గారి దంపతులకు క్రైస్తవ మత పెద్దలు ఆశీర్వచనాలు అందచేశారు. ఈ సందర్భం గా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ.. “ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, పెద్ద సంఖ్య లో క్రైస్తవ సోదరులు పాల్గొనడం సంతోషకరం. పార్టీ కార్యాలయం అంటే కేవలం రా జకీయ కార్యాలయం కాదు. సామాన్యు లు సమస్య లు చెప్పు కొనే వేదిక. పదవి అలంకరణ కాదు, ఇబ్బం దుల్లో ఉండే ప్రజల కోసం అని భావిం చిన నాడే సుపరిపాలన అందచేయగలం. ప్రభుత్వం లో ఉండే పెద్దలు, రా జకీయ నాయకులు కూడా అన్ని వర్గాల ప్రజల్ని సమదృష్టితో చూడాలి. మనం నడిచే బాట ఎవరికీ అన్ యాయం చేయకుం డా ఓ మార్పు కోసం నిలబడిన నాడు ప్రతి రోజు ప్రజలకు పండుగ రోజే అవుతుం ది” అన్నా రు. ఈ కార్య క్రమంలో జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ నాయకులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.