తిరుపతి: జనసేన షణ్ముఖ వ్యూహం టిడిపి భవిష్యత్‌కు గ్యారంటీ రాష్ట్రంలో రాక్షసపాలనకు చరమగీతం పాడబోతున్నాయని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. గురువారం జరిగిన జనసేన టిడిపి రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నవంబర్ 13న జరగనున్న ఉమ్మడి మేనిఫెస్టో సమావేశంలో తీసుకునే నిర్ణయాలు చరిత్రలో నిలిచి బోతాయన్నారు. ఇప్పటికే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహాన్ని ప్రకటిస్తే… చంద్రబాబు భవిష్యత్‌కు గ్యారంటీ అంటూ సూపర్ సిక్స్‌ను ప్రకటించారని తెలిపారు. ఈనెల 14 నుంచి 16 వరకు జనసేన, టిడిపి నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించ బోతున్నామన్నారు. ఇక నుంచి ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం చేస్తామని తెలిపారు. జనసేన, టిడిపి ఉమ్మడిగా చిత్తూరు జిల్లాలో 14 స్థానాలను కైవసం చేసుక ుంటామన్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించామని, రెండు పార్టీలు ఒకే నిర్ణయంతో ముందుకు సాగుతున్నామని ఆయన ఆ పత్రికా ప్రకటనలో తెలిపారు.