శ్రీకృష్ణపట్నం గ్రామంలో రెండవ రోజు ఉదృతంగా కొనసాగుతున్న జనం కోసం జనసేన మహాపాదయాత్ర
భారీగా తరలి వచ్చిన జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
పాదయాత్రలో బత్తుల కుటుంబానికి బ్రహ్మరధం పట్టిన ప్రజానీకం
రాజానగరం నియోజకవర్గం : రాజానగరం మండలం, శ్రీకృష్ణపట్నం గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ యువజన నాయకులు తోట పవన్ కుమార్, వీరమహిళా సాధికార కమిటీ కోఆర్డి నేటర్ శ్రీమతి బత్తుల ప్రత్యూష దేవి, వందనాంబిక ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ రాబోయే ఎన్ని కలలో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి బత్తుల బలరామకృష్ణ గారిని గెలిపించి నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేద్దాం అని తెలియజేస్తూ జనసేన పార్టీ కరపత్రం , కీచైన్, బ్యాడ్జ్ అందజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనశ్రేణులు, వీరమహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.