వైసీపీ సర్కార్ రోజుకో అవినీతిలో కార్యక్రమంలో ఈ రోజు గృహనిర్మాణ శాఖలో అవినీతిపై మాట్లాడుతున్నారు.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్. వైసీపీ సర్కార్ రోజుకో అవినీతిలో కార్యక్రమంలో ఈ రోజు గృహ నిర్మాణ శాఖలో అవినీతిపై మాట్లాడుతున్నారు.
• జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వైసీపీ సర్కార్ పేదలను వంచిస్తోంది.
• ఈ కాలనీలకు భూ సేకరణ పేరుతో అవినీతి చేస్తున్నారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు గత ఏడాది నవంబర్ లో గుంకలామ్ లోని జగనన్న కాలనీని సందర్శించి వాటి పరిస్థితి చూశారు. ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారని అప్పుడే చెప్పారు.
• ఈ కాలనీల ద్వారా లబ్ధి పొందింది జగన్, వైసీపీ ప్రజా ప్రతినిధులు మాత్రమే.
• భూసేకరణ పేరుతో రూ.35,141 కోట్ల అవినీతికి పాల్పడ్డారు.
• ముఖ్యమంత్రి శాసన సభలో చెప్పిన లెక్కలకు, ప్రభుత్వ ప్రకటనలకు పొంతన లేదు.
• వైసీపీ నాయకుల మధ్య వాటాల పంపకంలో గొడవలు రావడంతో అవినీతి లెక్కలు బయటకు వస్తున్నాయి
• గుంటూరు జిల్లాలో భయంకరంగా అవినీతి చేశారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు, ఆ పార్టీ నాయకులు, అధికారులు… చివరకు కలెక్టర్. అవినీతికి పాల్పడ్డ ఎవరినీ వదిలేది లేదు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఈ భూసేకరణపై విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేశారు.
• బురదల్లో, కొండల్లో, ఊరు చివర, శ్మశానాల దగ్గర భూములు ఇచ్చారు. అక్కడ కాలనీలు నిర్మిస్తామంటే ప్రజలు ఆందోళన చెందారు. అందుకే 95 వేల మంది లబ్ధిదారులు తమకు ఇళ్ల పట్టాలు వద్దు అన్నారు.
• భూ సేకరణపై విచారణ చేయాలి. ఎక్కడికైనా వెళ్ళి పరిశీలిద్ధాం. ఎవరి దగ్గర నుంచి భూమి సేకరించారు.. అందుకు చెల్లించిన మొత్తాలు పరిశీలిద్దాం. భూసేకరణ ప్రకటన ముందు రోజు భూమి కొంటారు… ప్రకటన వచ్చాక ఆ భూమి తీసుకుంటారు. తీసుకున్న మర్నాడే పేమెంట్ చేసేస్తారు. అసలు భూసేకరణ ఎంత పకడ్బందీగా చేయాలి? అలాంటిదేమీ లేకుండా హడావిడిగా కానిచ్చేశారు.
• ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో గృహ నిర్మాణానికి ఇచ్చిన బడ్జెట్ రూ.16,815 కోట్లు. చేసిన వ్యయం రూ.8250 కోట్లు మాత్రమే. అంటే పేదల గృహ నిర్మాణానికి ఇచ్చిన బడ్జెట్లో 50శాతం మాత్రమే ఖర్చు చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.