అమలాపురం నియోజకవర్గం విలసివిల్లి గ్రామంలో జనసేన కార్యకర్తలు ఇంటింటికీ జనసేన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అమలాపురం జనసేన కార్యకర్తలు గ్రామంలో గల ప్రతీ ఇంటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను మరియు మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ లో పొందుపరచిన అంశాలను ప్రజలకు వివరించారు. గ్యాస్ సిలిండర్ రూపంలో ఉండే ప్లకార్డులను ప్రజల వద్ద ప్రదర్శించి ఉచిత గ్యాస్ హామీ ప్రాధాన్యతను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అమలాపురం వీరమహిళలు, జనసైనికులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.