విజయవంతంగా పవనన్న ప్రజాబాట

వైజాగ్ సౌత్: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విజయవంతంగా పవనన్న ప్రజాబాట కార్యక్రమం కొనసాగుతుంది. నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం 105వ రోజుకు చేరింది. కార్యక్రమంలో భాగంగా 32వ వార్డు నంది వీధిలో పుష్పవతి అయిన అమ్మాయి సాయి శిరీస్మా కుమారికి వెండి పట్టీలు, పట్టు చీర అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అనిత, పద్మ, మంగ, లలిత, మణి, కందుల కేదార్నాధ్, కందుల బద్రీనాధ్, వరద సీను , టమట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.