మన దేశం క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో విజయం సాధించి క్రీడాభిమానులకు ఎంతో సంతోషాన్ని పంచిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆనందం వ్యక్తం చేశారు. భారత క్రికెట్ జట్టుకి శుభాకాంక్షలు. సెమీస్లో విజయం సాధించిన తీరు మన జట్టు సత్తాతాతును తెలియచేసింది. కెపెటోన్ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్, సిరాజ్… జట్టులోని ప్రతి ఆటగాడు ఎంతో తపనతో ఆడుతున్నారు. ప్రపంచ కప్ పోటీలు మొదలు అప్రతిహతంగా విజయాలు నమోదు చేస్తున్నారు. వరల్డ్ కప్ తుది పోరులోనూ ఇదే స్ఫూర్తితో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. కప్పు కైవశం చేసుకొంటారనే విశ్వాసం ఉందని జనసేనాని పేర్కొన్నారు.