లో‘పాల’ గుట్ట… వైసీపీ పా‘పాల’ చిట్

• జగనన్న పాల వెల్లువలో వెతికే కొద్దీ అవినీతి… అది పాపాల వెల్లువ
• పాడి పశువుల కొనుగోలులో మతలబు ఉందని బ్యాంకర్లు సైతం చెప్పిన మాట వాస్తవం కాదా?
• ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాలి
• అక్కలుచెల్లెళ్ళు అంటూనే ఆడబిడ్డలకు తీరని ద్రోహం చేస్తున్నారు
• పాడి పశువుల కొనుగోలు స్కాంపై ఆరోపణలకు జనసేన కట్టుబడి ఉంది
• క్షేత్రస్థాయిలో నిజానిజాలు నిగ్గుతేలుద్దాం రండి
• 14వ తేదీ నుంచి ప్రతి రోజూ వైసీపీ స్కాంలను రోజుకొకటి వెల్లడిస్తాం
• జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

‘జగనన్న పాలవెల్లువ కాదు.. పాపాల వెల్లువ… అని ఈ నెల 2వ తేదీన పత్రికా సమావేశంలో చెప్పిన మాటకు నూటికి నూరు శాతం జనసేన పార్టీ కట్టుబడి ఉంది . ఈ పథకంలో రూ.2887 కోట్లు అవినీతి జరిగిన మాట ముమ్మాటికీ వాస్తవం. పథకం ఎంతలా పక్కదారి పట్టిందో లెక్కలతో సహా ఆ రోజు వివరించాం . ఇప్పటికీ ఆ మాటలకు కట్టుబడే ఉన్నామ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు . నా అక్కలు, నా చెల్లెమ్మలు అంటూనే మహిళాభివృద్ధి పేరుతో ఆడబిడ్డలను ఎంతలా మోసం చేశారో లెక్కలతో సహా బయటపెట్టామని చెప్పారు . ఈ స్కామ్ పై రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన విచారణతోపాటు , అవినీతి తతంగంపై సీబీఐతో కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు . బుధవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “పాడిపశువుల కొనుగోలులో భారీ అవినీతి జరిగింది . ఏ స్థాయిలో అవినీతి జరిగిందో పత్రికా సమావేశంలో లెక్కలతో సహావివరించాం . మేము చేసిన ఆరోపణలపై మూడు రోజుల తరువాత ప్రభుత్వం స్పందించింది . ప్రభుత్వం అనే కంటే వైసీపీ పార్టీ తమ పేపర్, సోషల్ మీడియాలో దీనిపై స్పందించడం విడ్డూ రంగా అనిపించింది . పథకంలో ఎలాంటి అవినీతి జరగలేదు. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మాట్లాడారు . వాళ్లు చెప్పిన దానినిబట్టి చూస్తే , లోతుగా పరిశీలిస్తే ఈ పథకంలో మరికొన్ని నిజాలు బయటకు వచ్చాయి.

 • బ్యాం కు రు ణాల వివరాలు వెల్లడిం చగలరా?
  3.94 లక్షల పాడిపశువులు కొనుగోలు చేశామని ప్రభుత్వం చెబుతోంది . ఇందుకుగానూ రూ. 738 కోట్లను బటన్లు నొక్కి లబ్ ధిదారు ల ఖాతాల్లో వేశామని, రూ. 2216 కోట్లు స్త్రీనిధి ద్వా రా బ్యాం కులు రు ణాలు అందిం చాయని చెప్పారు . మొత్తం రూ. 2995 కోట్లు ఈ పథకం కోసం ఖర్చు చేశామని చెప్పారు . ఇంతపెద్ద మొత్తంలో బ్యాం కులు రు ణాలు ఇస్తే ఆ వివరాలు ఎక్కడున్నా యి? ఏ బ్యాం కు ఎన్ని కోట్లు రు ణాలు ఇచ్చింది ? ఆ రు ణాలు ఏ లబ్ ధిదారు డికి అందాయి? ఈ పథకంలో లబ్ ధిదారు డిని గుర్తిస్తే ఆయన కొనుగోలు చేసిన పాడి పశువులకు జియో ట్యా గిం గ్ చేస్తారు . స్థా నికంగా ఉన్న అధి కారి స్కీ మ్ గ్రౌండిం గ్ అయ్యిం దని సర్టి ఫికేట్ ఇస్తా డు. బ్యాం కర్లు రు ణాలు ఇస్తారు . 3.94లక్షల పాడి పశువుల్లో మేము చెప్పి న 8 వేలు తప్ప మిగి లిన వాటి ని చూపిం చగలరా? మీరు సై అంటే మేము క్షేత్రస్థా యి పర్యటనకు కూడా సిద్ధం గానే ఉన్నాం . వాస్తవాలను క్షేత్రస్థా యిలో కి వెళ్లి ప్రజలకు తెలియజేసేం దుకు మేం సిద్ధంగా ఉన్నాం . వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ముందుకు రావాలి.
 • తప్పు జరిగింది కనుకే బ్యాం కర్లు సహకరిం చడం లేదుము
  ఖ్యమంత్రి, ఆర్థి క మంత్రి సమక్షంలో రాష్ట్ర స్థా యి బ్యాం కర్ల సమావేశం జరిగింది . ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలు, లబ్ ధిదారు లు, ఎంతమంది రైతులకు పంట రు ణాలు ఇవ్వా లి? చిరు వ్యా పారు లకు ఎలా రు ణాలు అందిం చాలి? వంటి అంశాలపై చర్చిం చారు . ఈ సమావేశంలో ఆసక్తి కరమైన విషయం బయటపడింది . పాడి పశువుల కొనుగోలుకు బ్యాం కర్లు సహకరిం చడం లేదని పశువర్ధకశాఖ అధి కారు లు తెలిపారు . దీ నికి స్పందిం చిన బ్యాం కర్లు పాడి పశువుల కొనుగోలులో రీ సైక్లిం గ్ జరిగిం దని, ఒక లబ్ ధిదారు డు కొనుగోలు చేసిన పాడి పశువుని పది మంది కిపైగా కొన్నట్లు చూపిం చారు . అందుకే మేము సహకరిం చలేకపోతున్నా మని బ్యాం కర్లు స్పష్టం గా చెప్పారు . ఏ బ్యాం కు ఎంత రు ణం ఇచ్చిం దో వారి దగ్గర సమాచారం ఉంటుంది . గ్రామాలవారీ గా డేటా ఉంటుంది . ము ఖ్యమంత్రి గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు . ఆయన తలుచుకుం టే ఈ పథకంలో నిజంగా పశువులను కొనుగోలు చేశారా లేదా అని తెలుసు కోవాలంటే రెం డు రోజుల్లో నిజం తెలిసిపోతుంది .
 • పథకం లక్ ష్యం నీరు గారిపోయింది
  రాష్ట్రవ్యా ప్తం గా 22 లక్షల లీటర్ల పాల సేకరణే లక్ ష్యం గా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది . నిజానికి 3.94 లక్షల పాడి పశువులను ప్రభుత్వం కొనుగోలు చేసుం టే 15.76 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగేది . పశువుల కొనుగోలులో భారీ అవినీతి జరిగింది కనుకే అధి కారిక లె క్కల ప్రకారం 2.7 లక్షల లీటర్లు మాత్రమే ప్రభుత్వం సేకరిం చగలుతుంది . అది కూడా ఈ మహానుభావుడి పు ణ్యం కాదు. గత ప్రభుత్వంలో 1.2 లక్షల లీటర్లు సేకరిం చేవారు . ఇప్పు డు అదనంగా 1.5 లక్షలు లీటర్లు మాత్రమే పెరిగింది . 22 లక్షల లీటర్లు ఎక్కడా… 2.7 లక్షల లీటర్లు ఎక్కడ. ఏ స్థా యిలో ప్రభుత్వం ఆడబిడ్డలను మోసం చేసిం దో చూడండి. నిజంగా ప్రభుత్వం చెప్పి నట్లు చేసి ఉంటే రూ. 14,250 కోట్లు ఆర్థి క లా వాదేవీలు జరిగి , ఆర్థి క వృద్ధి జరిగేది . పథకం పక్కదారి పట్టింది కనుకే పథకం అసలు లక్ ష్యం నీరు గారిపోయింది.
 • రోజుకో స్కా మ్ బయటపెడతాం
  కొంతమంది వైసీపీ నా యకులు మాట్లాడుతూ పథకంలో పూర్తి వివరాలు సేకరిం చకుం డానే జనసేన నా యకులు దుష్ప్రచారం చేస్తున్నా రని మాట్లా డుతున్నారు . డేటా కేవలం ప్రభుత్వం దగ్గరే ఉంటుం దనే భ్రమలో వారు ఉన్నారు . ఏ జిల్లా అయినా ఏ మండలమైనా ఎంపి క చేసుకోం డి.. క్షేత్రస్థా యికి వెళ్లి పరిశీలిద్దాం . నిజాయతీగా లె క్కలతో సహా పథకంలో అవినీతి జరిగిం దని చెబితే – రాజకీయ కోణంలో విమర్శలు చేయడం మానేసి, నిజమా? కాదా తెలుసు కోవాలి? మా పార్టీ అధి నేత ఒకటే చెబుతారు . పత్రికా సమావేశాల్లో వ్యక్తి గత విమర్శలు, నిం దలు కాకుం డా సమస్య గురిం చి మాట్లా డాలని, తద్వా రా పరిష్కా రం చూపిం చాలని చెప్పారు . మేము దానికి కట్టుబడి ఉన్నాం . ము ఖ్యమంత్రికి పాలనపై పట్టులేదు. బటన్లు నొక్కే కార్యక్రమం ద్వా రా ప్రజలకు అపార నష్టం జరిగింది . నవంబర్ 14 తరు వాత జనసేన పార్టీ కేం ద్ర కార్యా లయంలో ప్రతి రోజు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి రోజుకో స్కాం పై లె క్కలతో సహా మాట్లా డతాం . ప్రభుత్వ అవినీతిని ప్రజాక్షేత్రంలో నే ఎండగడతాం ’’ అని అన్నారు . మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీ నర్ శ్రీ కళ్యా ణం శివశ్రీనివాస్, ఉమ్మడి గుం టూరు , కృష్ణా జిల్లాల అధ్యక్షులు శ్రీ గాదె వెం కటేశ్వరరావు, శ్రీ బండ్రెడ్ డి రామకృష్ణ, విజయవాడ, గుం టూరు నగరాల అధ్యక్షులు శ్రీ పోతిన వెం కట మహేష్, శ్రీ నేరెళ్ల సురే ష్, అధి కార ప్రతినిధి శ్రీ అక్కల రామ్మో హన్ రావు, రాష్ట్ర కార్యదర్శు లు శ్రీ సయ్యద్ జిలా నీ, శ్రీ బేతపూడి విజయ్ శేఖర్, శ్రీ మండలి రాజేష్ తది తరు లు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.