నెల్లిమర్ల: డెంకాడ మండలం, బంగారురాజుపేట గ్రామంలో శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యం లో గురువారం ఇంటింటికీ జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాధవి గారి ప్రతి గడపకి పర్యటిస్తూ ఈ దుష్ట పాలన పోవాలంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో మద్దతు తెలియజేయాలని ప్రజలను కోరారు. ముఖ్యంగా బంగారురాజుపేట గ్రామంలో పారిశుద్ధ్యం, రోడ్లు, మరియు వీధి దీపాల పరిస్తితి ఎంతో దయనీ స్థితిలో ఉంది గ్రామ ప్రజలు నాయకులు పై విసిగిత్తి పోయి జనసేన వైపు చూస్తున్నారు. ప్రస్తుత పాలనతో విసిగి పోయి జనసేన పార్టీ రావాలి, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి మరియు ప్రజలకు మంచి జరగాలి పేదోడికి న్యాయం జరగాలి అని బంగారురాజుపేటలో సుమారు 60 కుటుంబాల నుంచి గ్రామప్రజలు శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకొని జనసేన పార్టీలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పైలశంకర్ కోరాడ అప్పారావు వీరమహిళ అట్టాడ ప్రమీల జ్యోతి కోన శివ పాండ్రంకి మహేష్ ఉపేంద్ర మరియు గ్రామ నాయకులైన అప్పల రెడ్డి వీరబాబు, శ్రీను, లక్ష్మణ్, మోహన్, పవన్, రాజు, నవీన్ రెడ్డి, ఆది, రాము, మహేష్, నరేష్, సాయి, లోకేష్, వరుణ్, హరీష్ మరియు శ్రీను పాల్గొన్నారు.