అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట నేల పాలవడంతో
రైతులు కన్నీటి పర్యంతమైతున్నారు, రైతులు స్థానికంగా పండించిన ధాన్యాన్ని స్థానికంగానే మిల్లులకు
అమ్ముకునే అవకాశం కల్పించాలని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల
దుర్గేష్ డిమాండ్ చేయడం జరిగింది. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను జిల్లా అధ్యక్షులు కందుల
దుర్గేష్ పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాలలోని మిల్లులకి
కేటాయిస్తే ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ చాలా ఎక్కువ అవుతాయి. మీరు బస్తాకి 1530 రూపాయలు
ఇస్తామని చెప్తున్నారో మద్దతు ధర అదే ధర తడిచిన ధాన్యానికి కూడా ఇవ్వాలి. ఎందుకంటే రైతు
కష్టపడి పండించిన తర్వాత మీరు సకాలంలో దానిని రైతు భరోసా కేంద్రాల ద్వారా కోనిపించకపోవడం
వలన లేదా దగ్గర్లో ఉన్న మిల్లర్లకు ఇవ్వకపోవడం వలన వాళ్లు ఈ తడిసిపోయే పరిస్థితికి వచ్చారు.
అందువలన మీరు కచ్చితంగా తడిసిపోయిన, ముక్కవిరిగిపోయిన ఏరకంగా అయినా సరే ఆపదలో
ఉన్న రైతును ఆదుకోవాలంటే 1530 రూపాయల మద్దతు ధర ఏదైతే ఉందో అది ప్రతి బస్తాకి ఇచ్చి
తీరాలని స్పష్టంగా చెప్తున్నాము. ఇదేదో కబుర్లు చెప్పేసి లేదా నవరత్నాలని చెప్పి మరొకటి మరొకటి
అని చెప్పి తప్పించుకుంటే కుదరదు. రైతు భరోసా కాదిది రైతులను మోసం చేసే ప్రభుత్వమని రైతులే
చెప్తున్నారు. మా ప్రధాన డిమాండ్ స్థానిక మిల్లులకు అమ్ముకునే అవకాశం, విరిగిన తడిసిన ధాన్యాన్ని
1530కి కొనాలి మేము ఏదైతే చెప్పమో ఈ ప్రభుత్వం స్పందించి రెండు మూడు రోజుల్లో కష్టంలో
ఉన్న రైతులని ఆదుకోకపోతే మేం మాత్రం జిల్లా వ్యాప్తంగా ఒక కార్యచరణ ఏర్పాటు చేసుకొని
ఉద్యమిస్తాము. ఇప్పటికే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో
చెప్పింది ప్రభుత్వం పాలసీ కరెక్ట్ గా లేదు, రైతులకు అన్యాయం చేసే పాలసీగా కనపడుతుంది. మేము
అధికారంలోకి వస్తే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే ఒక కొత్త పాలసీనీ
తీసుకొస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా రెండు మూడు రోజుల్లో ఈ ప్రభుత్వం స్పందించకపోతే
జిల్లా వ్యాప్తంగా కార్యచరణ రూపొందించి, ఒక ఉద్యమం చేస్తామని జనసేన పార్టీ తూర్పుగోదావరి
జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కలిదిండి గోవింద్,
వైస్ ఎంపీపీ గణపతి, కడియపులంక ప్రెసిడెంట్ మార్గాన్ని అమ్మని ఏడుకొండలు, ఎంపీటీసీ నాగిరెడ్డి
రామకృష్ణ, కడియం మండల ప్రెసిడెంట్ ముద్రగడ జమ్మి, మాజీ సర్పంచ్ గట్టి నరసయ్య, లాయర్
ప్రభాత్, జనసేన పార్టీ ప్రధాన కర్యదర్శి బోడపాటి రాజేశ్వరి, జనసేన పార్టీ వేమగిరి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కొప్పిశెట్టి రాజేష్, జంగా వినోద్, మల్లు శివ, చిలుకూరి నాగేశ్వరావు,
కామిశెట్టి వెంకటేష్, ఉండమట్ల ప్రభాకర్, గందం వీరబాబు, గోవింద్, బాలు, తూము శీను, పుల్లా శ్రీను మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.