కాకినాడ సిటి : జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో కాకినాడ సిటీ సహాయ కార్యదర్శి కంట రవిశంకర్ ఆధ్వర్యంలో 6వ డివిజన్ రేచర్ల పేటలో జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ అఘాయిత్యాలలో ఆంధ్రప్రదేశ్‌ని అగ్రస్థానంలో నిలబెట్టింది ఈ వై.సి.పి ప్రభుత్వమని దునుమాడారు. సంక్షేమం చేయడం ప్రభుత్వ బాధ్యత అనీ దానిని తమ ప్రభుత్వ ప్రత్యేకత అనే రీతి లో తమఖాతాలో వేసుకోవడం ఈ వై.సి.పి ప్రభుత్వాని కే చెల ్లిందని ఎద్దేవా చేసారు. దళిత చిన్నారులకు మామయ్య అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి కాకినాడ సిటి లో ఎంతమంది దళితులకు ఇళ్ళు కట్టించారనీ, ఎంతమంది దళిత విధ్యార్ధులకి విదేశీ విద్యకి ఋణాలు మంజూరు చేసారో శ్వేతపత్రం విడుదలచేయమని డిమాండ్ చేసారు. దళితులపై ఈ వై.సి.పి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యపరుస్తూ స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల మధు, కె.ప్రశాంత్, బి .నాని , కె నాయుడు , ఎస్.ఎస్ రవి, జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నా రాయణ, కార్యదర్శి ము త్యా ల దుర్గా ప్రసాద్, 21 వ డివిజన్ అధ్యక్షులు మండపాక దుర్గా ప్రసాద్, బండి సు జాత, ము త్యా ల దుర్గ శివకుమారి, యేలేటి సోనీ ఫ్లోరె న్స్ , సబ్బే దీప్తి , బోడపాటి మరియ, బట్టు లీల, రమణమ్మ, ఉమ తదితరులు పాల్గొన్నారు.