• పర్యటనను అడ్డుకునేందుకు అదృశ్య శక్తులు ప్రయత్నించాయి
• శ్రీ పవన్ కళ్యాణ్ ప్రతి అడుగులో ఆంక్షలే
• ఎన్ని ఆంక్షలు పెట్టినా జనసేన వెనక్కి తగ్గదు
• మత్స్యకారులకు భరోసా ఇచ్చేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ మొండిగా వచ్చారు
• విశాఖ హార్బర్ లో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
కష్టాల్లో ఉన్న మత్స్యకారుల్ని ఆదుకునేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బయలుదేరితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ఎన్నో అదృశ్య శక్తులు ఎన్నో కోణాల నుంచి ప్రయత్నాలు చేశాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆరోపించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి రెండు గంటలకు హార్బర్ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంది.. బాధిత నష్టపోయిన కుటుంబాలను పరామర్శించాల్సి ఉండగా అనూహ్యంగా ఆయన విమానాన్ని మాయం చేశారని తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానంలో ప్రతి అడుగులో ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నా , జనసేన పార్టీ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మత్స్యకార సోదరులకు భరోసా ఇచ్చేందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొండిగా విశాఖకు వచ్చినట్టు స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం విశాఖ హార్బర్ లో బోట్లు తగలబడి నష్టపోయిన మత్స్యకారులకు పార్టీ తరఫున రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందచేశారు. మొత్తం 49 మంది మత్స్యకారులకు పరిహారం అందించారు. ఈ వేదికపై నుంచి శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “విశాఖ హార్బర్ లో ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రతి మత్స్యకారుడికి రూ.50 వేలు అందించాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేస ేందుకు జనసేన పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పార్టీ నాయకత్వం ఇక్కడికి వచ్చి తమవంతు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల్ని అనేక రకాలుగా మోసం చేస్తూ వస్తున్న సందర్భంలోనూ అన్నింటినీ తిప్పి కొట్టి ప్రజలకు అండగా నిలబడింది కూడా జనసేన పార్టీ. రాష్ట ్రాన్ని చాలా ఏళ్లు పాలించిన వ్యక్తులు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారు స్పందించడానికి వెనకడుగు వేసిన సందర్భంలో ప్రజలకు కష్టం వచ్చి న ప్రతి సారీ స్పందించిన పార్టీ జనసేన. ప్రభుత్వం లో లేకపోయినా, పదవులు లేకపోయినా ప్రజలకు అండగా నిలిచింది జనసేన. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రతి జిల్లాలో కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు తో ముందుకు వచ్చి సాయం అందించారు. మొన్న జరిగిన ప్రమాదంలో 49 బోట్లు దెబ్బ తిన్నాయి. ఇవి ప్రభుత్వ లెక్కలు కాదు. క్షేత్ర స్థాయిలో మా నాయకులు పర్యటించి పరిశీలించి వేసిన లెక్క . వారందరికీ పార్టీ తరఫున సాయం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వంలో ఉన్న వారికి స్పందించే మనసు లేదు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు మానవతా దృక్పథంతో స్పందించనప్పుడు రాష్ట ్రానికి మేలు జరగదు. ఆ విషయాన్ని ప్రజలు గమనించాల”ని అన్నారు.
• ఈ దుర్మార్గ ప్రభుత్వంలో మత్స్యకారుల అభివృద్ధి లేదు – శ్రీ బొమ్మిడి నాయకర్
పార్టీ మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మడి నాయకర్ మాట్లాడుతూ.. “వైసీపీ ప్రభుత్వం ప్రతి విషయంలో మత్స్యకారుల్ని మోసం చేస్తోంది. బీసీ, ఎస్సీ సబ్ ప్లా న్ కిం ద గతంలో మత్స్యకారులకు వలలు కొనుక్కు నేందుకు, కోల్ డు స్టో రేజీలు ఏర్పాటు చేసు కునేందుకు ప్రభుత్వా లు రుణాలు ఇచ్చే వి. ఈ దుర్మా ర్గ ప్రభుత్వం వచ్చి న తర్వా త రుణాలు లేవు. మత్స్యకారుల అభివృద్ధీ లేదు. కేవలం మా సామాజికవర్గా న్ని ఈ ప్రభుత్వం ఓటు బ్యాం కుగా మాత్ర మే భావిస్తోం ది. రాబోయే ఎన్ని కల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వా త మత్స్యకారులకు అన్ని విధా లా అండగా ని లబడతా మ”ని తెలి పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యు లు శ్రీ కోన తాతా రావు, శ్రీమతి పడాల అరుణ, ప్రధా న కార్యదర్శు లు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్, శ్రీ బొలి శెట్టి సత్య, శ్రీమతి పాలవలస యశస్వి , విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, రాష్ట్ర అధికార ప్రతిని ధులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పరుచూరి భాస్క రరావు, పార్టీ నేతలు శ్రీ పీవీఎస్ఎన్ రాజు, డాక్టర్ సందీప్ పంచకర్ల, శ్రీమతి పసుపు లేటి ఉషాకి రణ్, డా.బొడ్డేపల్లి రఘు, శ్రీమతి అంగ ప్రశాంతి , శ్రీ బోడపాటి శివదత్, శ్రీ పీతల మూర్తి యాదవ్, శ్రీ దల్లి గోవిం దరెడ్డి , శ్రీ కందుల నాగరాజు, డాక్టర్ మూగి శ్రీని వాస్, శ్రీమతి లోకం మాధవి, శ్రీమతి రేయ్యి రత్న, శ్రీ శివప్రసాద్ రెడ్డి , శ్రీమతి కి రణ్ ప్రసాద్, శ్రీమతి నాగలక్ష్మి, శ్రీమతి శారణీ, శ్రీమతి యర్రా రేవతి తదితరులు పాల్గొన్నారు.