గుంటూరు: మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి అవసరం వచ్చినా ప్రజలకు జనసేన, టీడీపీ శ్రేణులు అందుబాటులో ఉంటా యని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. మంగళవారం 22వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు సయ్యద్షర్ఫుద్దీన్, టీడీపీ అధ్యక్షుడు షేక్ నాగూర్ లతో కలిసి కార్మికుల కాలనీలో నిపీకలవాగు పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వర్షంలోనే పర్యటిస్తూ ప్రజలను కలిసి మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ మరో 48 గంటలు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్న నేపధ్యంలో ప్రజలు మరిం త అప్రమత్తం గా ఉండాలని కోరారు. ప్రజలకు అందుబాటులో నగరపాలక సంస్థ కమీషనర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నెం బర్ 0863 -2234014 అందుబాటులో ఉంటుందన్నా రు. ప్రజలకు ఏ అవసరం వచ్చి నా క్షేత్రస్థా యిలో జనసేన, టీడీపీ శ్రేణులు అందుబాటులో ఉంటా యని ఆళ్ళ హరి తెలి పారు. మె హబూబ్ బాషా , కోలా అంజి, నైజామ్ బాబు, మల్లి, జిలాని, అలా కాసులు, బియ్యం శ్రీను, రమేష్, సుందరరావు తదితరులు పాల్గొన్నారు.