కర్ణాటక: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించాలని అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవాసంఘం వారు కుకె సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2018లో పవన్ కళ్యాణ్ గారు కుకె సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక్క చెట్టును నాటరు అధి ఇప్పుడు చాలా శోభాయమానం పెరుగుతోంది . అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు తన ప్రజా జీవితంలో అభివృద్ధి చెందాలని అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవ సంఘం నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ చెట్టుకు రక్షణగా ఇనప కవచం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మురళి గౌడ, తమిళనాడు జనసెన ప్రదీప్, చిక్బల్లాపూర్ జిల్లా అధ్యక్షులు బుజ్జి నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేంద్రనాయక్, బెంగళూరు నగర అధ్యక్షుడు అనిల్ కుమార్, చింతా మణి తాలూకా కార్యదర్శి నరేంద్ర తదితరులు పాల్గొన్నా రు.