పంచాయతీలను నిర్వీర్యం చేసిన వైసీపీ సర్కార్

 • నిధులు కాజేసి, పంచాయతీల అధికారాలను అస్తవ్యస్తం చేశారు
 • రూ.3,359 కోట్ల నిధులు పక్క దారి
 • రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచిన ప్రభుత్వం
 • వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి బురద
 • ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో
 • వైసీపీ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది
 • వచ్చే జనసేన – తెలుగుదేశం ప్రభుత్వ స్థాపన కోసం కష్టపడి పని చేయాలి
 • నెల్లిమర్ల నియోజకవర్గ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ నాదెండ్ల మనోహర్

‘ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పంచాయతీలకు సంబంధించిన రూ. 3,359 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం తన ఇష్టానికి వాడేసుకుంది . స్థానిక పరిస్థితులు, సమస్యలను అనుసరించి గ్రామాల్లో ఖర్చు పెట్టాల్సిన నిధులను సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లకు తెలియకుండానే దారి మళ్లించి పంచాయతీల పొట్ట కొట్టింది . అదే నిధులు గ్రామాలకు ఖర్చు పెడితే ఈ రోజున గ్రామాల్లో ఎన్నో మౌలిక వసతులు, సౌకర్యాలు ఉండేవి. గ్రామ పంచాయతీలను వైసీపీ ప్రభుత్వం నిలువునా పాతర వేసింది ’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. జనసేన పార్టీ ఉమ్మడి విజయనగరం జిల్లా సమన్వయకర్త, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి అశేష జనావళి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గం కార్యాలయం ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలో రాజ్యాంగాన్ని గౌరవించని పరిపాలన సాగుతోంది . మహనీయుడు శ్రీ అంబేద్కర్ రాసిన అద్భుతమైన రాజ్యాంగ విలువలకు వైసీపీ ప్రభుత్వం పాతర వేసింది . ఇష్టం వచ్చినట్లు పాలన సాగించడం తప్ప రాజ్యాం గంలోని మౌలి క సూ త్రాలను కూడా ఈ ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదు. సొం త రాజ్యాం గాన్ ని, నిర్ణయాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి చేస్తు న్న పాలనతో పంచాయతీలు పూర్తి గా నిర్వీ ర్యం అయిపోయాయి. ప్రజా స్వా మ్య పద్ధతిలో ప్రత్యక్ష ఎన్ నిక ద్వా రా గ్రామ మొదటి పౌరుడిగా గెలి చిన సర్పం చ్ అధికారాలకు సైతం వైసీపీ ప్రభుత్వం పూర్తి గా కత్తె ర వేసింది . వారి ఖాతాల్లో ఉండాల్సిన నిధులను వారికి తెలి యకుం డానే ప్రభుత్వం దారి మళ్లిం చడం అంటే కచ్చి తంగా పంచాయితీలను మోసం చేయడం కిం దకే వస్తుంది . వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీల పీక నొక్కి పాలన చేస్తున్నా రు.

 • భోగాపురం పంచాయతీలో కాగ్ తనిఖీలు
  కనీసం కేం ద్ర ప్రభుత్వం ఇచ్చి న ఆర్థి క సంఘం నిధులను కూడా వారికి ఇవ్వకుం డా చేయడం వెనుక ఈ ప్రభుత్వ అసలు నైజం దాగి ఉంది . ఆర్థి క సంఘం నిధులు రూ. 3,359 కోట్లు విడతల వారీ గా వైసీపీ ప్రభుత్వం దారి మళ్ళిం చి ఇష్టారీ తిన వాడుకోవడం దుర్ మార్గం . కాగ్ వంటి కీలకమైన సంస్థలు సైతం ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టి నా ఏమాత్రం బెదరకుం డా ముం దుకు వెళ్తున్న వైసీపీ కచ్చి తంగా ప్రజా కోర్టు లో సమాధానం చెప్పి తీరాలి . రాష్ట్రం లో సుమారు ఐదు పంచాయతీల్లో కాగ్ లెక్కలను పరిశీలిస్తే విజయనగరం జిల్లా భోగాపురం పంచాయతీలో కూడా కాగ్ పరిశీలన, తనిఖీలు చేసిన వాటిలో ఉంది . పంచాయతీల తనిఖీల్లో కూడా ఎన్నో లోపాలు బయటపడ్డా యి. వాటిని కూడా ప్రభుత్వం మరుగున పడేలా చేసింది . సర్పం చులు చేయాల్సిన పనులకు కూడా నిధులు లేకుం డా వారి చేతులు కట్టే సి ప్రభుత్వం ఆటలా డుతోంది .
 • ఉత్తరాం ధ్ర కోసం ప్రత్యే క ప్రణాళి క
  అపారమైన వనరులు, విశేషమైన మానవ సంపద కలగలిపి న నేల ఉత్తరాం ధ్ర. ఇక్కడ దొరకని సహజ సంపద లేదు. శ్రమిం చి పనిచేసే అద్భు తమైన మానవ శక్తి మరె క్కడా కనిపిం చదు. అలాం టి ఉత్తరాం ధ్రలో దశాబ్దాలుగా ఎమ్మెల్యే లు, ఎంపీలు, మంత్రులు అయిన నాయకులు ఈ ప్రాంతా నికి వెలగబెట్టింది ఏమీ లేదు. ఈ ప్రాం తంలోని అన్ ని వనరులు దోచుకొని వారు పెద్దవారు అయ్యా రు తప్పితే ఇక్కడి ప్రజల జీవనస్థి తిగతుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. ఉత్తరాం ధ్ర ఉజ్వ ల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ప్రత్యే కంగా ప్రణాళి క వేస్తుంది .
  ఉత్తరాం ధ్ర కోసం పార్టీ తరఫున ప్రత్యే కంగా మేనిఫెస్టోను తయారు చేసి, అమలు చేసే బా ధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుంది . ఇక్కడ ఉన్న పరిస్థి తులకు అనుగుణంగా అభివృద్ధి చేసి చూపుతాం . కాలుష్యరహిత పరిశ్రమలకు అధిక ప్రాధాన్యమిచ్చి ఉత్తరాం ధ్ర ప్రజల ఆరోగ్యా నికి భరోసా కల్పిం చే బా ధ్యతను తీసుకుంటాం . ఎంతో చరిత్ర కలి గిన విజయనగరం నేలలో జనసేన ప్రస్థానాన్ ని సువర్ణ అక్షరాలతో లి ఖిం చేలా పని చేస్తాం . వెనుకబాటు తనం, వలసలు లేని సరికొత్త ఉత్తరాం ధ్రను ఆవిష్కరిం ప చేస్తాం . పరిపాలన మేమే సాగిం చాలి అనే నియంత ధోరణితో ఉత్తరాం ధ్ర ప్రజా నీకాన్ ని పట్టి పీడిస్తు న్న వారిపై బలమైన పోరాటా లు చేస్తాం .
 • అన్నింట్లోనూ అవినీతి
  వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏ పథకం చూసినా అవినీతితో నిం డిపోయింది . విద్యా శాఖ విషయంలోనూ జరిగిన అవినీతి పనుల్ని ఇప్ప టికే జనసేన పార్టీ తరఫున బయట పెట్టాం . జగనన్న విద్యా కానుకలో ఇచ్చి న నాసిరకపు విద్యా వస్తు వుల ద్వా రా ఎంత మొత్తం కొల్లగొట్టారు అన్నది కూడా ఇప్ప టికే వివరించాం . ఈడీ చేసిన దాడుల్లో రూ. 120 కోట్ల మేర అవినీతి లెక్కలు జగనన్న విద్యా కానుకలో బయటపడడం ప్రాథమిక అవినీతిలో భాగం మాత్రమే.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.