నేను సామాజిక సమతుల్యత గురించి ఆలోచించే సమయంలో… జగన్ బెంగళూరులో అవినీతి లెక్కల్లో ఉన్నాడు

• అవినీతి డబ్బు సరిపోక ప్రజల నుంచి దౌర్జన్యం చేసి లాక్కోవడం జగన్ పాలన
• 80 శాతం పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారు
• కులాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు
• నేను కులాల వెనకబాటు గురించి మాట్లాడతాను
• అధికారం అందని కులాలకు సంపూర్ణ అధికారం అందేలా చేస్తాం
• నిర్ణయాత్మక శక్తి ఉన్న పదవులను అందజేస్తాం
• వామ పక్షం, సనాతన ధర్మం కలగలిపే భావజాలం నాది
• వైసీపీకి మరో ఛాన్స్ ఇవ్వకూడదనే బలమైన సంకల్పంతోనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం
• 2009 రాజకీయ ప్రస్థానం తప్పు మళ్లీ జరగకూడదు
• మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పలువురిని పార్టీలోకి ఆహ్వానించి ప్రసంగించిన శ్రీ పవన్ కళ్యాణ్

‘సమాజంలో అణగారిన, వెనకబడిన వర్గాలకు నిర్ణయాత్మక అధికారం కావాలి. వారి వారి
కులాలకు సంబంధించి అభివృద్ధి వైపు నడిపించే నిజమైన అధికారం వారికి చెందాలన్నదే జనసేన పార్టీ
ఆకాంక్ష. ఇప్పటి వరకు అధికారం చూడని కులాలకు నిజమైన అధికారం దక్కాలి. ఆయా వర్గాల వారిని
వారు అభివృద్ధి చేసుకునేందుకు దారి చూపాలన్నదే జనసేన అసలు సిద్ధాంతమ’ని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నేను ప్రతి సభలోనూ కులాల గురించి మాట్లాడతానని వైసీపీ నాయకులు అంటారు…
80 శాతం నామినేటెడ్ పోస్టులను, ఇతర పదవులను ఒకే కులానికి కట్టబెట్టిన వైసీపీకి అసలు కులాల గురించి
మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు అని గుర్తించుకోవాలని స్పష్టం చేశారు. శనివారం మంగళగిరి పార్టీ కేంద్ర
కార్యాలయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పలువురు కీలక నేతలు పార్టీలో చేరారు. వారికి
శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్
కళ్యాణ్ గారు మాట్లాడుతూ “నేను కులాల గురించి ఎప్పుడు మాట్లాడినా విద్వేషాలు నింపేలా మాట్లాడను.
ఆయా కులాల సాధికారత, అభివృద్ధి ఎలా జరగాలి అన్నదానిపైనే నిజాలు మాట్లాడతాను. భారతదేశం
కులాల సమూహం. కులాల గురించి, ఆయా సామాజిక వర్గాల అసలు స్థితిని చెప్పకపోతే ఎలా? 2008లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించక ముందే 2004 నుంచి కూడా నేను దళిత,
బీసీ సంఘాల నాయకులతో ఎన్నో విషయాలపై సుదీర్ఘంగా చర్చించాను. అధికారం లేని వారికి ఎలాంటి సాధికారత కావాలి… నిర్ణయాత్మక శక్తి ఎలా ఇవ్వాలి అన్న దానిపై చర్చించాను.
బీసీ, ఎస్సీ కార్పొరేషన్లలో నిధులు, అధికారం లేకపోతే ఆయా వర్గాలకు నిజమైన అభివృద్ధి ఎలా దక్కుతుంది? అది నిజమైన సాధికారత ఎలా అవుతుంది? కేవలం లెక్కలు, ప్రజలను
మభ్యపెట్టడానికి పదవులు ఇవ్వడం సరికాదు. ఒక కులం, మతం, ప్రాంతం కోసం ఆడే రాజకీయ ఆట చాలా చిన్నది. ఏ కులానికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇస్తూ, సంపూర్ణ సాధికారత
వారికి అందజేసేందుకు జనసేన ఉంది.
• 2004లో వై.ఎస్.ది ఎన్నికల్లో నిలబడటానికి డబ్బు లేని పరిస్థితి
జనాభాపరంగా సమాజంలో అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఎలాంటి అధికారం, పదవులు, అభివృద్ధి చాలా కులాలకు అందడం లేదు. నేను అన్నగా భావించే ప్రజా యుద్ధ నౌక శ్రీ
గద్దర్ గారు చనిపోయే ముందు నాకు చెప్పి న మాట ఏమిటంటే… సమాజంలో అభివృద్ధి చెందిన కులాలను ద్వేషించడం అంటే మనం ఎదుగుతున్నట్లు కాదు. వారి సహాయంతో
మనం ఎలా ఎదగాలి అనే ఆలోచన చేసినప్పుడే ఎదుగుదల మొదలవుతుంది. ఒక
చేయితో అభివృద్ధి చెందిన కులాల వారి సహాయాన్ని పట్టుకొని, మరో చేయి అణగారిన
కులాలకు అందించాలి. అప్పుడే నిజమైన సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుంది.
నేను దానిని కచ్చితంగా పాటిస్తాను . సమాజంలో ఉన్న రెల్లి, మాదిగ ఉప కులాలు,
అరుంధతీయులకు, బీసీలకు, ఇతర సామాజిక వర్గాలకు ఇప్పటి వరకు అందని
నిజమైన అధికార సాధికారితను అందిద్దాం. జనాభాలో ఆయా వర్గాలకు చెందిన
జనాభా ఎంత ఉంటే అంతే దామాషా పద్ధతిలో వారికి అధికారం అందాలి. దీనికోసం
రాజకీయ మార్గంలో ఓ ప్రణాళిక ప్రకారం ప్రయాణం చేద్దాం. ప్రతిసారి జగన్ అవినీతి
గురించి ఎంత మాట్లాడినా ప్రజలు దాన్ని పెద్ద సీరియస్ విషయంగా తీసుకోవడం
లేదు. ఈ రోజుల్లో ఎవరు తినడం లేదు అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. నేను
ఇవన్నీ క్షుణ్ణంగా గమనించే జగన్ అవినీతి మీద మాట్లాడటం మానేశాను. ప్రజలకు
నష్టం చేకూరుస్తున్న అంశాలు, ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడాల్సిన అవసరం ఉంది.
సమాజంలో జరుగుతున్న కోట్ల రూపాయల అవినీతి తతంగం ఎవరికీ పట్టడం లేదు.
అవినీతి విషయంలో సగటు మనిషి ఆలోచన తీరు మారిపోయింది. దీనిపై వారిలోనే
మార్పు రావాలి. అవినీతి గురించి సీరియస్ గా ప్రజలు ఆలోచించి ఉంటే జగన్ అసలు
అధికారంలోకి వచ్చే వాడే కాదు. జగన్ దోపిడీ మీద కూడా కేంద్ర పెద్దలకు ఫిర్యాదు
చేద్దామని ఆలోచిస్తే వారికి ఈ విషయం తెలీదా..? అనే సందేహం నాకు కలుగుతుంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ఎన్నికల్లో నిలబడటానికి డబ్బు
లేని పరిస్థి తి నుంచి అధికారం వచ్చిన తరువాత సాక్షి లాంటి పత్రికలు నడిపే స్థాయికి
వచ్చారంటే ఏం జరిగ ిందో ఈజీగా అర్ధమవుతుంది. నేను బీసీలు, ఎస్సీల గురించి
ఆలోచించే సమయంలో జగన్ బెంగళూరులో అవినీతి లెక్కల్లో ఉండేవాడు. రూ. 30
రూ. 40 వేల కోట్లు వీరికి చాలా చిన్న విషయం.
• దోచుకున్నది సరిపోకే కల్తీ మద్యం
దోచుకున్న ఇన్ని వేల కోట్లు సరిపోక మరింత కూడబెట్టడానికి కల్తీ మద్యం రూపంలో
ప్రజల ప్రాణాలు తీసి సంపాదిస్తున్నారు. ఇసుకను దోచేస్తూ ఆర్జిస్తున్నా రు. వైసీపీ
చేస్తున్న అన్యా యాలను ఎవరైనా అడిగితే, ప్రశ్నిస్తే బెదిరించడం ప్రాణాలు తీయడం
చాలా సులభం అయిపోయింది. ఇంత డబ్బు సరిపోక ప్రజల నుంచి దౌర్జన్యంగా
లాక్కోవడం జగన్ చేస్తున్న పాలన. జగన్ అవినీతి గురించి ప్రజలు ఆలోచించడం
మానేసి చాలా రోజులైంది. వారికి కావాల్సిన రోడ్లు, పన్ను లు, మైనింగ్ దోపిడీ,
దౌర్జన్యా లు, బెదిరింపులు మీద చైతన్యవంతం చేస్తూ పోరాడాల్సిన అవసరం ఉంది.
వామపక్ష భావజాలం, సనాతన ధర్మానికి దగ్గరగా ఉన్న వారు నన్ను అమితంగా
ఇష్టపడతారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.