కాకినాడ సిటిలో జనసేన పార్టీ నాయకులు పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలమేరకు శ్రీమన్నారాయణ & మావులూరి సురేష్ల ఆధ్వర్యంలో 6వ డివిజన్ అల్లూరి సీతారామరాజుగారి విగ్రహం ఉన్న వీధి దగ్గర దివ్యాంగుల భరోసా యాత్ర జరిగింది. ఈ యాత్రలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు దివ్యాంగులను కలిసి వారితో వారి సమస్యలపై చర్చించి జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తపరచిన నినాదం దివ్యాంగులు సమాజానికి భారం కాదు వారే కుటుంబానికి ఆధారం అయ్యే రోజులను రాబోయే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వ హయాములో నిజం చేస్తామన్న భరోసాను తెలియచేసి వారికి కానుకని అందచేసి తమ సంఘీభావాన్ని తెలియచేసారు. ఈ సందర్భంగా వారు ఈ వై.సి.పి ప్రభుత్వం తీసుకుంటున్న తుగ్లక్ చర్యలను ఖండిస్తూ దివ్యాగులని ఇంతలా క్షోభపెట్టిన ఈ ప్రభుత్వం వారి ఉసురు పోసుకుంటోందన్నారు. ప్రజలు ఈ ముఖ్య మంత్రి చెప్పేవి అన్నీ నీటి రాతలని అంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శివ, జిల్లా కార్యదర్శి సత్య నారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ ఉపాధ్యక్షులు అడబాలసత్య నారాయణ, జనసేన నాయకులు దాసరి వీరబాబు, మనోహర్, ఆకుల శ్రీనివాస్, దారం సతీష్, దుర్గా ప్రసాద్, అగ్రహారం సతీష్, తోట కుమార్, శివాజీ యాదవ్, రాగిణి తదితరులు పాల్గొన్నారు.