తిరుపతి: టిడిపి, జనసేన పొత్తు నేపధ్యంలో నియోజకవర్గ స్థాయిలో రెండు పార్టీల సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపా రు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పూతలపట్టు, సత్యవేడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కోరారు. టిడిపి నేతలతో కలిసి మెలిసి పొత్తు ధర్మాన్ని పాటించాలని కోరారు. ఈ కార్య క్రమంలో సత్యవేడు నియోజకవర్గ నాయకులు లా వణ్య కుమార్, హేమ కుమార్, ఐరాల మండల అధ్య క్షుడు పురుషోత్తం ప్రధాన కార్య దర్ శి తులసి, యువ నాయకుడు వినయ్ మండల ఉపా ధ్య క్షుడు చందు, తవణంపల్లి మండల అధ్య క్షుడు శివ, యాదమరి మండల అధ్యక్షుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు.