జనసేన – తెలుగుదేశం పార్టీల మధ్య నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణకు జనసేన పక్షాన బాధ్యులను నియమించారు. వీరి నియామకానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆమోదం తెలిపారు. ఉభయ పక్షాల సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణను- ‘పాయింట్ ఆఫ్ కాంటాక్ట్’ గా నియమితులైన వీరు సమన్వ యపరుస్తారు. ఈ నెల 14వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉభయ పక్షాల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు ప్రారంభమవుతున్నాయినానియ. ఇటీవల విజయవాడలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఖరారు చేసిన అజెండా ప్రకారం క్షేత్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమాలను ఉమ్మడిగా ముందుకు తీసుకువెళ్లడంపై ఇరు పక్షాల నేతలు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాలలో శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. 17వ తేదీ నుంచి నియోజకవర్గ స్థాయిలో జరగబోయే ఇంటింటికీ కార్యక్రమం… భవిష్యత్తుకు గ్యారంటీ మరియు ఓటర్ లిస్ట్ పరిశీలన తదితర అంశాలను విజయవంతం చేసే విధంగా కార్యా చరణ రూపొందిస్తారు.