డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన నాయకులు, జనసైనికులతో తుఫాను ప్రభావితలో తట్టు ప్రాంతాలను రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం వల్ల లో తట్టు ప్రాం తాలలో ని చాలా ఇల్లు నీట మునిగాయి. ముంపుకు గురైన ప్రాంతంలో ప్రజలు త్రాగునీటి కి కూడా ఇబ్బం దులు ఎదుర్కొంటున్నా రని వెంటనే ఫోనులో అధికారులతో మాట్లాడి త్రాగునీటిని అదించాలని చెప్పారు. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అదేవిధంగా నీతి నిజాయితీకి మారు పేరు అయిన పవన్ కళ్యా ణ్ ఇప్పటి కే ఆదేశాలు ఇచ్చా రని ఏ పేద వారికి కష్టం వచ్చి నా చూసి తట్టు కోలేని మంచి మనస్తత్వం ఉన్న నాయకులు పవన్ కళ్యా ణ్, వారి ఆదేశాల అనుగు ణంగా తుఫాన్ తగ్గక తరువాత జనసేన నాయకులు, జనసైనికులు వారి దగ్గరికి వె ళ్లి కష్టసుఖాలు తెలుసుకుని బాధితులకు అండగా ఉంటా మన్నా రు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పం చ్ మేడిది సరోజ, జనసేన నాయకులు మేడిది మోహన్, ఏసు, వీర వెం కట్, చవ్వా కుల వెం కట్ తదితరులు పాల్గొన్నారు.