రంపచోడవరం నియోజవర్గం : వి.ఆర్ పురం మరియు కూనవరం మండలాల్లో గత మూడు రోజులుగా తుఫాను వల్ల కురుస్ తున్న భారీ వర్షాలకు మిర్చి పొగాకు పంటలు నష్టపోయాయి . ఈ వర్షాల వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా రంపచోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులు కుర్ల రాజశేఖర్ రెడ్డి మరియు రంపచోడవరం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంచార్జ్ శ్రీమతి వంతల రాజేశ్వరి గ్రామంలో రైతులు వద్దకు వెళ్లి పంట నష్టం గురించి తెలుసుకోవడం ప్రభుత్వం తక్షణమే పంట కోల్పోయిన రైతులకు పరిహారం అందజేయాలని, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్య క్రమంలో పాల్గొన్న కూనవరం జనసేన పార్టీ మండలం అధ్యక్షులు నరేంద్ర, వి.ఆర్ పురం జనసేన పార్టీ మండల అధ్యక్షులు సాయి కృష్ణ, జనసేన పార్టీ నాయకులు పసగొడుగుల సీత, గోపి, బాగుల ప్రమీల, కెచ్చల పోసిరెడ్డి , పెట్ట నాగేంద్రబాబు, కొనతం వాసు, సమ్మరాజు, మణికంఠ, పవన్ కళ్యాణ్, సాయి బాబు, దుర్గా ప్రసాద్, పవన్, శేఖర్ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.