ముందుగా జి.మూలపొలం గ్రామంలో కనకదుర్గమ్మను ఆంజినేయస్వామి వారిని దర్శించి, గ్రామదేవత సత్తమ్మతల్లి అమ్మవారిని దర్శించి, వారి ఆశీస్సులు తీసుకుని , భారతరత్న బి.ఆర్ అంబేద్కర్‌కు పూలమాల అలంకరరించి ఈ కార్య క్రమాన్ని ప్రారంభించారు . జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గారు ఐ పోలవరం మండలం జి.మూలపొలం గ్రామంలో అంబేద్కర్ కాలనీ తూముకాడపేట గ్రామాలలో ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంచి గాజుగ్లాస్ పై ఓటు వేసి బాలకృష్ణ గారిని గెలిపించాలని కోరారు . గ్రామంలో ఉన్న సమస్యలైనా వాటర్ సమస్యలు, ఇంటి లోన్ సమస్యల గురించి తెలుసుకుని వాటిని కచ్చితంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం లో అని సమస్యలు తీరుస్తానని హామీఇచ్చారు . జి మూలపొలం గ్రామంలో జి.మూలపాలెం నుండి కాట్రేకోన మండలం గొల్లగరువుకు గోదావరి బ్రిడ్జి ఎప్పటినుండో పూర్తిగా కాకుండా అలాగే ఉందని ఇది ప్రభుత్వ వైఫల్యమని , జి. మూలపొలం గ్రామంలో మత్సకార కమ్యూనిటీ హాలు పునాది వేసి 15 సంవత్సరాలు దాటినా పూర్తికాలేదు అని , కచ్చితంగా మా ప్రభుత్వంలో ఇలాంటివి చేసిపెడతామని అన్నారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు, జిల్లా కార్య వర్గసభ్యులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు .