విజయనగరం, జర్నలిస్టుల ఐక్యతే సమాజానికి మేలు చేస్తుందని, తద్వాదావూరా మంచి సమాజాన్ని, దేశాన్ని నిర్మించుకోగలమని జనసేన నాయకుడు గురాన అయ్యలు అన్నారు. విజయనగరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలోని వర్క్ జర్నలిస్టులకు దీపావళిని పురస్కరించుకొని దివాళీ గిఫ్ట్స్ ను అయన వితరణగా అందించారు. ఈ సందర్బంగా అయ్యలు మాట్లాడుతూ జర్నలిస్టులంతా ఒకే తాటిపై ఐక్యంగా కనిపించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. అంతా ఐక్యంగా ఉంటేనే సమాజంలోని రుగ్మతలను పారద్రోలగలరని, పాలనలో అవినీతిని రూపుమాపగలరని అన్నారు. ఆశ్రిత పక్షపాతంచూపక, తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా వారిని ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు జర్నలిస్ట్‌లకే ఉందని అన్నా రు. తమ తండ్రి స్వ ర్గీయ గురాన సాధు రావు నాటి కాలం నుంచి అయన వారసత్వంగా అనేక సేవా కార్య క్రమాలు చేస్తూనే ఉన్నామని, జర్నలిస్ట్ లకు తమ కుటుంబంతో అవి నాభవ సంబంధం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుందన్నారు. జర్నలిస్ట్ మిత్రులకు ఏ అవసరం వచ్చినా తనవంతుగా ముందుంటానని అన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రతి నిధులు అయ్యలను ఉచిత రీతిన దుస్సాలువ కప్పి సత్కరించారు. అదేవిదంగా నగరంలో ప్రముఖ వ్యాపారి శ్రీరామ ఫైర్వర్క్స్ యజమాని రవ్వా శ్రీనివాస్ రావు కూడా ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ లకి దివాళీ గిఫ్ట్ బాక్స్‌ని అందించారు. ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గురాన అయ్యలు, విశిష్ట అతిధిగా విచ్చేసిన డిపీఆర్వో డి.రమేష్ చేతుల మీదుగా ఈ గిఫ్ట్స్ ను జర్నలిస్ట్‌లకు అందించడం జరిగింది. ఈ కార్య క్రమాకి ఎమెం ఎల్ నాయుడు , ఎం.ఎస్.ఎన్.రాజు, అవనాపు సత్య నారాయణ ప్రధాన బాధ్యత వహించగా, సీనియర్ జర్నలిస్ట్‌లు డీడీ శివ ప్రసాద్, గమిడి కోటేశ్వరరావు, బూరాడ శ్రీనివాస్‌రావు, అల్లుసూ రిబాబు, మహా పాత్రో, పంచాది అప్పారావు తదితరులు పాల్గొన్నారు.