జనసేన – తెలుగుదేశం పొత్తును ఆశీర్వదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు

• బీజేపీ శుభాశ్శీసులు ఉన్నాయి
• వైసీపీ విముక్త రాష్ట్రమే ప్రథమ అజెండా
• పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు తప్పవు
• పార్టీ ఉన్నతి కోసం పని చేసిన వారికి వచ్చే ప్రభుత్వంలో తగిన గుర్తింపు
• ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించిన శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీ చంద్రబాబు నాయుడు
• మొదటి జాబితా 118 సీట్లలో జనసేన 24, తెలుగుదేశం 94 సీట్లలో పోటీ
• జనసేన తరఫున తొలుత అయిదుగురి పేర్లను ప్రకటించిన శ్రీ పవన్ కళ్యాణ్

‘రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పడిన పొత్తు కోసం జనసేన – తెలుగుదేశం పార్టీలు రెండూ ఐక్యతగా పని చేయాల్సిన
సమయం ఇది. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జనసేన – తెలుగుదేశం పార్టీల నాయకులు,
కార్యకర్తలు సమష్టిగా పని చేయాలి. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల ఓట్లు రెండు పార్టీల అభ్యర్థులు పోటీ చేసే చోట్ల పక్కాగా బదిలీ
జరగాల’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. రెండు పార్టీల ఓట్లు కచ్చితమైన బదిలీ జరిగేలా పటిష్ట
ప్రణాళికతో పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. శనివారం మాఘ పౌర్ణమి.. మంచి రోజు కావడంతో ఉమ్మడి అభ్యర్థుల
జాబితాను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు
గారు కలిసి విడుదల చేశారు. తొలి విడత విడుదల చేసిన జాబితాలో మొత్తం 118 స్థానాల్లో జనసేన 24 స్థానాల్లో, తెలుగుదేశం
పార్టీ 94 స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించాయి. జనసేన నుంచి మొదటగా అయిదుగురు అభ్యర్థుల పేర్లను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో మిగిలిన
పేర్లను ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు, టిడిపి ఏపీ అధ్యక్షులు శ్రీ
అచ్చెన్నాయుడు గారు, మాజీ మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘6 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును ఆలోచించి,
వైసీపీ విముక్త రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వచ్చే ఎన్నికల్లో పొత్తులతో ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈ పొత్తుకు బీజేపీ శుభాశీస్సులు ఉంటాయి. పార్టీ ఉన్నతి కోసం నాకు తోడుగా నిలబడిన
ప్రతి ఒక్కరినీ మనసులో పెట్టుకుంటాను. గుర్తుంచుకుంటాను. రాష్ట్రం భవిష్యత్తు కోసం, వైసీపీ పాలనను పారదోలడానికి ఏర్పరుచుకున్న పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు తప్పవు.
పార్టీ కోసం నిరంతరం కష్టపడిన ప్రతి జనసేన నాయకుడు, జన సైనికులు, వీర మహిళల కష్టాలను, పోరాటాన్ని గుర్తుంచుకుంటాను. వారికి వచ్చే ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం
కల్పించే బాధ్యతను తీసుకుంటాను. జనసేన 24 సీట్లలోనే పోటీ చేస్తోందని భావించకండి. మూడు పార్లమెంటు సీట్ల పరిధిలోని 21 స్థానాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ
పోటీ చేస్తున్నామని భావించాలి. వైసీపీ పాలనలో నాశనం అయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. జనసేన – తెలుగుదేశం పార్టీల పొత్తును ప్రజలు
మనస్ఫూర్తిగా ఆశీర్వదించేం దుకు సిద్ధంగా ఉన్నారు.
• సిద్ధంగా ఉండండి… ఆపలేని యుద్ధం ఇస్తాం
సిద్ధం.. సిద్ధం అంటూ రోజూ వైసీపీ నాయకుడు చావగొడుతున్నాడు. సిద్ధంగా ఉండండి… మీకు ఆపలేని యుద్ధం ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరఫున బలంగా పోరాడే
యుద్ధం ఇస్తాం. కచ్చితంగా పేదవాడి బతుకులను బాగు చేసే విధంగా పోరాటం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో మన కూటమి గెలవబోతోంది. దీనిలో సందేహం లేదు’’ అన్నారు.
• సంపూర్ణ సహకారంతో వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి : శ్రీ చంద్రబాబు నాయుడు
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ‘‘రాష్ట్రాన్ని వైసీపీ కంబంధ హస్తాల నుంచి విముక్తం చేసేందుకు తెలుగుదేశం
– జనసేన పార్టీలు సంపూర్ణంగా సహకరించుకొని ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది. రాజకీయ స్వార్థం కోసం ఏర్పడిన పొత్తు కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న పొత్తు నిర్ణయం.
ప్రజా వేదిక విధ్వంసంతో మొదలైన ఈ పాలన ప్రజా జీవితాలను విధ్వంసం చేసింది. ఇలాంటి పరిపాలనకు స్వస్తి పలకాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ప్రకటించిన అభ్యర్థులను వివిధ
రకాల సర్వేలు, నివేదికలు తర్వా త ప్రజలందరి ఆమోదంతోనే ఎంపిక చేశాం. దాదాపు 1.1కోట్ల మంది అభిప్రాయాలను తీసుకున్నాం. ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది.
రాష్ట్రంలో స్వే చ్ఛగా బతికే పరిస్థితి లేదు. పత్రికల మీద దాడులు, అధికారులపై బెదిరింపులు సర్వ సాధారణం అయ్యాయి. నా రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత అరాచక పాలనను
వైసీపీ పాలనలో చూశాను. ప్రశ్నించే వారిపై కక్ష కట్టి దాడులు చేస్తున్నారు. ప్రజల ఆస్తులను దోచుకునే పరిస్థితి వచ్చింది. ప్రజల భవిష్యత్తు కోసం తీసుకున్న పొత్తుల నిర్ణయం వల్ల
ఈసారి ఆశించిన ప్రతి ఒక్కరికీ సీటు రాకపోవచ్చు. వారికి తగిన విధంగా అండగా నిలుస్తాం. వచ్చే ఎన్నికల్లో ఈ దుర్మార్గ పాలనను పారదోలాలంటే ప్రజలంతా ఏకమై తిప్పికొట్టాలి’’
అన్నారు.
• శ్రీ పవన్ కళ్యాణ్ ప్రకటించిన జనసేన పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసే అయిదుగురు అభ్యర్థులు

  1. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు – తెనాలి
  2. శ్రీ కొణతాల రామకృష్ణ గారు – అనకాపల్లి
  3. శ్రీమతి లోకం మాధవి గారు – నెల్లిమర్ల
  4. శ్రీ పంతం నానాజీ గారు – కాకినాడ రూరల్
  5. శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు – రాజానగరం

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.