తిరుపతి : 20వ డివిజన్, ఎంఆర్ పల్లి, శ్రీ కృష్ణ నగర్ పరిసర ప్రాంతాలలో శుక్రవారం జనసేన – టిడిపి కలిసి భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో టిడిపి , జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి అధికార పార్టీ రేపు తిరిగి అధికారంలోకి రావడం కోసం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో వివరించి, 24లో రాబోఏది జనసేన, టిడిపి ఉమ్మడి ప్రభుత్వం మేనని , మేము అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చే మంచి పధకాల వివరాలను వారు వివరించారు.