కాకినాడ సిటి : జనసేన పార్టీ శ్రేణులు పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో “జగన్ ఇళ్ళ మోసం చొల్లంగి జగనన్న లే-అవుటుకి బాటను వెతుకుదాం రండి ” అనే కార్యక్రమం చేపట్టారు.లోగడ వై.ఎస్.ఆర్ ప్రభుత్వం జగనన్న ఇళ్ళు అంటూ హడావిడిగా పేదలకు ఇళ్ళు అందిస్తామంటూ అట్టహాసంగా ముఖ్యమంత్రి కాకినాడకు వచ్చి మరీ శంఖుస్థాపన చేసిన ఇళ్ళ వాస్థవ పరిస్థితులను పరిశీలించేందుకు ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో అక్కడకు వెళ్ళడం జరిగింది. ఈ పరిశీలనలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఈ వై.సి.పి ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న శ్రద్ధ సదుపాయాల కల్పనమీద లేదని ఇక్కడి కొచ్చి చూస్తే అర్ధమవుతొందన్నారు. ఆదరా బాదరాగా ప్రకటించేసి పేద ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించిది ఈ వై.సి.పి ప్రభుత్వం అని , తీరా చేతలలోకి వచ్చే సరికి తాళము వేసితి గొళ్ళెము మరిచితి అన్నట్టుగా లే-అవుట్లోకి వెళ్ళే ప్రధాన మార్గం విషయం మరిచారని ఎద్దే వాచేస్తూ సరైన ప్రధాన బాటని చూపించగలరా అని సవాలువిసిరారు. సగం దూరం వెళ్ళీ ముందుకెళ్ళే దారి లేక వెనక్కు వచ్చే పరిస్థితి అని విమర్శించారు. ఆఖరికి కష్టపడి అక్కడికి వెళ్ళితే ఎవరి స్థలం ఎవరిదో చెప్పలేని స్థితి ఎదురైందన్నారు. ప్రకటించి ఇంతకాలమైనా ఇలాగే ఉంటే మరి ముఖ్యమంత్రి కోతలు కోసిన గృహప్రవేశాల సంగతి ఎప్పుడు అని ప్రశ్నించారు . చిత్తశుద్ధి లేని పనులు ఇలాగే ఉంటాయని దీనిని ప్రజలు గమనిస్తునారనీ తగిన సమయంలో బుద్ధి చెపుతారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్యం , జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మడ్డు విజయ్, జనసేన నాయకులు శివాజీ యాదవ్, నాగు , మల్లేశ్వరరావు, నందకుమా ర్, ఆకుల శ్రీనివాస్, మనోహర్‌లాల్ గుప్తా , సుంకర సురేష్, బండి అజయ్, పెద్ది రెడ్డి రాజేష్, అగ్రహారం సతీష్, పెమ్మడి సాంబశివ, పెద్ది రెడ్డి సంతోషి తదితరులు పాల్గొన్నారు.