జగన్ను అధికారమనే ఆకలి వేధిస్తోందన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్
పసుపులేటి హరిప్రసాద్. ఆదివారం గుడిపాలలో జరిగిన జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన
పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన, టిడిపి నాయకులు అన్నదమ్ముల్లా కలిసిపోవడం చాలా ఆనందంగా ఉందన్నారు . అన్ని యుగాల్లో రాక్షసుల గురిం చి విన్నా మని, కానీ కలియుగంలో జగన్ రూపంలో రాక్షసున్ని చూస్తున్నా మన్నారు . జగన్ బకాసుడురుడిలా ప్రవర్తిస్తున్నా డన్నారు . జగన్ మోహన్ రెడ్డి సిఎం సీటు కోసం పాకులాడుతున్నా డే తప్ప ప్రజా సమస్యలు పట్టిం చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు కొం త మంది ఎమ్మెల్యేలు కూడా శాం డ్, ల్యాండ్, బ్రాండ్ ల రూపంలో తిం టున్నా రన్నారు . జగన్ దగ్గర ధనం, దౌర్జన్యం , దొంగ ఓట్లు ఉంటే… జనసేన, టిడిపి దగ్గర జనం ఉన్నా రన్నారు . ప్రపంచాన్ని ఎపి వైపు చూసేలా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు ఓ వైపు ఉంటే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను తీర్చి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని గర్జిం చి, భవన కార్మికుల సమస్యల కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ మరో వైపు ఉన్నారన్నారు . చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రజలను గెలిపిం చాలనే ఏకమయ్యారన్నారు . టిడిపి అనుభవం ఉన్న మిషన్ గన్ అయితే.. జనసేన యువత బుల్లెట్లు అని తెలిపారు. వీరిద్దరూ కలిసి జగన్ ని ఓడిం చడం ఖాయమన్నారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, రాష్ట్ర కార్యదర్శి కవిత, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, చిత్తూర్ జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధు బాబు, జిల్లా కార్యదర్శి ఆనంద్, నెహ్రు, యశ్వంత్, సీనియర్ నాయకులు శివ, టీడీపీ నాయకులు ఎక్స్ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .