పాయకరావు పేట, సోమవారం జనసేన పార్టీ నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యుల జాబితా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ కర్తగా నియమించబడిన గెడ్డం బుజ్జికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు వారాహి విజయయాత్ర వాలంటీర్స్ కోర్ కమిటీ సభ్యులు శివదత్ బోడపాటి అభినందనలు తెలిపారు.