గురజాల నియోజకవర్గం : జనసేన పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర 4వ రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామంలో జనసేన – టిడిపి నేతలు పర్యటించారు. ముందుగా పోలింగ్ బూత్ల గురించి తక్కెళ్లపాడు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని పెద్దలను , యువతను కలిసి రైతు సమస్యల గురించి చర్చించి దీనిపై సమిష్టి పోరాటం చేద్దా మని హామీ ఇచ్చిన జనసేన – టిడిపి నేతలు. గ్రామంలో ప్రస్తుత పరిస్థితులపై జనసేన – టిడిపి నేతలుకూలంకుషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిలు, నాలుగు మండలాల అధ్యక్షులు, మండల, గ్రామ కమిటీ సభ్యులు, వీరమహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.