మదనపల్లి నియోజకవర్గం , జనసేన పార్టీ కార్యాలయంలో ఓటరు జాబితాను పరిశీలించి అవకతవకలు గురించి ఆదివారం రవీంద్ర నాథ్ ఠాగూర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు పరిశీలనలో బి.ఎల్.ఓ ల సమక్షంలో ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలపై జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించడం జరిగింది. స్థానిక బి.ఎల్.ఓ లు నిస్పక్ష పాతంగా వ్యవహరించాలని అన్నారు. ఓటర్ జాబితాలో చాలా వరకు ఒక బూత్ నుండి మరొక బూత్‌కి ఓటర్ని మార్చడం చేసారని, ఇలా చేస్తే ఓటర్లు చాలా ఇబ్బంది పడతారని వాటిని సరిచేయాలని, సరిచేయని పక్షంలో ఎలక్షన్ కమిషన్ కి పిర్యాదు చేస్తామని గంగారపు రాందాస్ చౌదరి అన్నారు. తెలంగాణలో ఏ విధంగా బిఆర్ఎస్ పార్టీ పాతాళంలోకి వెళ్లి కాంగ్రెస్ అధికారంలోకి వచిందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన-టీడీపీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం , టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ, ఐటీ విభాగ నాయకులు లక్ష్మినారాయణ, చంద్ర శేఖర, కుమార్, నవాజ్, జవిలి మోహన్ కృష్ణ, లవన్న , ఆదినారాయణ, జనర్దన్, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.