డా .బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం కరవాక గ్రామానికి చెందిన కొల్లు లక్ష్మి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. గురువారం వారి కుటుంబ సభ్యులను కలసి లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని, యోగక్షేమాలను అడిగి తెలుసుకుని,వైద్య ఖర్చుల నిమిత్తం 2,500 రూపాయలను వారికి ఆర్ధిక సహాయం చేసిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు సఖినేటిపల్లి మండల కార్యదర్శి బొమ్మిడి ఏడుకొండలు, అంతర్వేది దేవస్థానం ఎంపిటిసి బైరా నాగరాజు, మణికంఠ, స్వామి తదితరులు అడిగి తెలుసుకోవడం జరిగింది.