• ప్రమాదంలో మరణించిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కుల పంపిణీ
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు కార్యకర్తలను తనవాళ్ళుగా భావిస్తారు … వారికి అండగా నిలవాలని తపిస్తారు అని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు . క్రియాశీలక సభ్యుల కోసం తీసుకువచ్చిన రూ.5 లక్షల ప్రమాద బీమా అనేది బాధలో ఉన్నవారికి ఒక ఓదార్పు అన్నారు . బుధవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గుంటూరు జిల్లాకి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు శ్రీ చల్లగిరి రామకృష్ణ, శ్రీ సిద్ధంశెట్టి గోపీకృష్ణల కుటుంబాలను శ్రీ మనోహర్ గారు పరామర్శించారు . ఇటీవల జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో వారిరువురూ ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన క్రియాశీలక సభ్యులకు నివాళులు అర్పించారు . ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు . గురజాల నియోజకవర్గం శ్రీనగర్ గ్రామానికి చెందిన శ్రీ రామకృష్ణ భార్య శ్రీమతి సామ్రాజ్యం , పెదకూరపాడు నియోజకవర్గం కాశిపాడుకి చెందిన శ్రీ గోపీకృష్ణ తల్లి శ్రీమతి శ్రీదేవిలకు రూ. 5 లక్షల బీమా చెక్కులు అందచేశారు . భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.