గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు లాడ్జి సెంటర్లో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి చులకనగా మాట్లాడుతుంటే రాష్ట్ర మంత్రులందరూ ఏం చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మీడియా ముందుకు వచ్చి వాగే ఈ మంత్రులందరూ ఇప్పుడు మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారని ఎద్దే వచేశారు. తెలంగాణ ముఖ్య మంత్రి అంటే భయమా లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణలో ఉన్న ఆస్తులకు ఏమైనా జరుగుతుందని భయంతో ఎవరు ఏం మాట్లాడడం లేదా అని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర మంత్రులందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం అని అన్నారు. రాష్ట్రంలో వర్షాలు లేక విపరీతంగా కరువున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కడ కరువు మండలాలను ప్రకటిస్తే పక్క రాష్ట్ర ముఖ్య మంత్రి మాట్లాడింది నిజమని అందరూ అనుకుంటారని భయంతో కరువు మండలాలను తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వా నిదే అని ఎద్దేవ చేశారు. ఒకపక్క గుంటూరు జిల్లాలో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కరువు తాండవం చేస్తుంటే ఇదే జిల్లాకు చెందిన మంత్రులు అంబటి రాంబాబు గారుగాని, విడుదల రజనీ గారు గాని ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించు కోలేకపోవడం వారి నిర్లక్ష్య వైఖరికి సమాధానంగా నిలుస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి గతంలో నాగార్ జునసాగర్ కుడి కాలవ నుంచి నీళ్లు వదలమని చెప్పి పంటలు ఎవరు వేసుకోకండి కేవలం ఆరుదడిగా మాత్రమే నీళ్లు ఇస్తామని చెప్పి ఈరోజు కరువు లేదనటం ఏంటని ప్రశ్నించారు. తర్వాత ఆరుది అడుగు కూడా పంటలు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఎక్కడో ఒక చోట వేసుకున్న పత్తి మిరప పంటలకై నీళ్ల కోసం రైతులందరూ కూడా వాటర్ ట్యాంకులు కొనుక్కొని వచ్చినీళ్లు పెడుతున్న విషయం మీకు తెలియదా.. అలాగే జెసిబిలు తెచ్చుకొని కుంటలు తవ్వించుకుంటున్న విషయం మీకు తెలియదా.. మంత్రిగారి నియోజకవర్గ పరిస్థితి కూడా మంత్రి గారికి తెలియని దుస్థితిలో మంత్రిగారు ఉండడం చాలా బాధాకరమని, వీరు మంత్రిగా ఉండటానికి ఏమాత్రం అర్హత ఉందో తెలియజేయాలని అన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారు 28 కరువు మండలాలు అని పంపించి నప్పటికీ ప్రజా ప్రతినిధుల సహకారం లేకపోవడంతో జిల్లా లో ఒక్క కరువు మండలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం ప్రజా ప్రతినిధుల చేతకానితనానికి నిదర్శనం అని అన్నారు. త్వరలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి సహాయ చర్యలు చేపట్టనిచో జనసేన పార్టీ మిత్రపక్షాలతో కలిసి జిల్లావ్యా ప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల రాష్ట్ర మైన్స్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లో ఇసుక వల్ల ఆదాయం తగ్గిపోయిందని, దానివల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగిందని సిబిఐ వారికి కంప ్లైం ట్ చేయడం, వారు దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దారుణమైన విషయం అని అన్నా రు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక క్వారీల ద్వారా, ఇసుక మైనింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టారో శ్వేత పత్రవిడు దల చేయాలని అన్నారు. ఇదే వెంకట్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వం ఏర్పడ్డా క జనసేన పార్టీ అక్రమ ఇసుక మైనింగ్ మీద అనేక పర్యాయాలు కంప ్లైంట్ ఇచ్చినప్పటికీ నిమ్మకు నీరెత్తి నటు వ్యవహరించిన అధికారులు, ఈరోజు ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలా మారడం దుర్మా ర్గమైన విషయమని అన్నారు. మంత్రులకు ఎలాగో ప్రభుత్వ పనితీరు మీద కనీస అవగాహనలేదని, అధికారులైనా సరే కనీసం రాజ్యాం విలువలు పాటించాలని హితవు పలికారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం చేసిన దుర్మా ర్గమైన చర్యలను గమనించాలని, రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం మిత్రపక్ష కూటమిని గెలిపించి అధికారం ఇవ్వాలని కోరారు. ఈ కార్య క్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యా లరావు, నారదాసు రామచంద్ర ప్రసా ద్, కొర్రపాటి నాగేశ్వరరావు, పట్టణ నాయకులు శ్రీపతి భూషయ్య , నెల్లూరి రాజేష్ మరియు తదితరులు పా ల్గొన్నారు.