గిద్దలూరు నియోజకవర్గం : కంభం జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం మండల పార్టీ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో గిద్దలూరు జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు మాట్లాడుతూ మండలంలో గ్రామ పర్యటనకు మండల నాయకులు అందరు సహకరించాలని మీ విలువైన సమయాన్ని రాబోవు అయిదు నెలలు పార్టీ కోసం సమయం కేటాయించాలని కోరారు. పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. కంభం మండలంలో రైతులు ఎదుర్కొ న్న సమస్యలను నియోజకవర్గం సమస్యలతో కలిపి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, కంభం మండలం అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు అప్పనబోయిన వెంకటయ్య, కార్యదర్శులు దండే నాగార్జున, కర్ణశివ శంకర్, ఖెరంగనాయకులు, ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి లోకేష్, సంయుక్త కార్యదర్సులు, షేక్ హజ్మతుళ్ళ , వేము ప్రవీణ్, తోట వెంకటేశ్వర్లు , పెనుగొండ పాండుపాేండ్, జనసేన కార్యకర్తలు శ్రీపతి కాశయ్య, జమ్ములదిన్నే పిచ్చయ్య, అర్ధవీడు మండల నాయకులు వీరనాల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.