గుంటూరు: రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న జగణాసురిడి పాలనను అంతం చేయాలి అంటే ఓటు హక్కు ఒక్కటే వజ్రాయుధమని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. కొత్తగా విడుదలైన గుంటూరు తూర్పు , పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై పార్టీ నగర కమిటీ, డివిజన్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ వైసీపీ అసమర్ధ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగి పోయారన్నారు. వైసీపీ అరాచక పాలనను ఎప్పుడు అంతం చేద్దామా అన్న కసితో ప్రజలున్నారన్న నిఘా వర్గా లు అందించి న సమాచా రంతో వైసీపీ నేతలు ఓటమి భయంతో ఎన్ నికల్లో దాష్టీకాలకు పా ల్ప డే అవకాశం ఉందన్నా రు. ఈ నేపథ్యం లో ఓట్ల జాబితాలో అక్రమాలకు పా ల్పడు తున్నా రన్న వార్తలు వస్తు న్న నేపధ్యం లో ప్రజల్ని చైతన్య పరచా ల్సి న బాధ్య త ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఓట్ల జాబితాలో తమ ఓటు ఉందో లేదో ప్రజలందరూ ఒక్కసారి సరిచూసుకోవాలన్నారు. మీ ఓటు మీ ప్రాంతంలోనే ఉందా లేక వేరే ప్రదేశంలో ఉందా అని పరిశీలించు కోవాలన్నారు. కొత్తగా నమోదు చేసుకున్నవారి ఓట్లు జాబితాలో కనిపించటం లేదన్న సమాచారం వస్తుందన్నారు. ఓటు నమోదులోనూ , మార్పులు, చేర్పులోనూ వైసీపీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్న నేపధ్యంలో ఓట్ల జాభితపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అదేవిధంగా ఎన్నికల కమీషన్ ఈ నెల నాలుగు, ఐదు తేదీల్లో ప్రతీ పోలింగ్ భూతులో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు చేసేందుకు బీయల్ఓలు ఉంటారన్నారు. ఈ కార్య క్రమంలో ప్రజలు పాల్గొని తమ ఓటు హక్కు విషయమై పరిశీలించుకునేలా పార్టీ నేతలు కృషి చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర కమిటీ ఉపాధ్యక్షుడు చింతా రాజు, సంయుక్త కార్యదర్శి నాగేంద్ర సింగ్, మహంకాళి శ్రీను, వీరమహిళలు ఆషా , సుజాత, పులిగడ్డ గోపి, బందెల నవీన్ పలువురు డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.