మదనపల్లె నియోజకవర్గంలో ఓటరు జాబితా అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఓటరు జాబితా వె రిఫికేషన్, ఈవీఎం యంత్రాల పనితీరుపై రాజకీయ పార్టీల నాయకులకు, అధికారులకు అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ ఓటరు జాబితా తప్పులతడకగా ఉందన్నా రు. దీం తోపాటు అవకతవకలు ఉన్నట్లు చెప్పా రు. ము ఖ్యం గా అర్హుల ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు చేర్చ డం, ఒక వార్డులో ని ఓట్లు మరో వార్డులో కి చేర్చ డం, డో ర్ నంబర్లు సరిగా లేకపోవడం, డబుల్ ఎంట్రీ, ఓటర్ నమోదులో టెక్నికల్ సమస్యలు, సిబ్బంది నిర్లక్ష్యం , ఇలా అనేక సమస్యలతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టిం చుకోలేదని వాపోయారు. ఓటరు జాబితాను పారదర్శకంగా, నిష్పక్ష పాతంగా తయారు చేయాలన్నారు. కానీ అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అర్హుల ఓట్లను తొలగిస్తూ దొంగ ఓట్లు చేరుస్తున్నారని మండిపడ్డారు. దీనిపై అధికార యంత్రాంగం దృష్టి సారించి జాబితాను సరిదిద్దాలని సూచించారు. టీడీపీ రాజంపేట పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ అర్హుల ఓట్లను తొలగించడం, దొంగ ఓట్లను చేర్చడంలో అధికార యంత్రాం గమే కీలకపాత్ర పోషి స్తోందని ఆరోపించారు. దీంతో ఓటరు జాబితా తప్పులతడకగా ఉందని విమర్శిం చారు. జాబితాను చక్కదిద్దే బాధ్యత అధికారులపై ఉందన్నారు. అలాగే 18 ఏళ్లు పూర్తయిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు విద్యా సాగర్, శంకర, హరి, కార్యకర్తలు పాల్గొన్నారు.