ముమ్మిడివరం నియోజకవర్గం : ఐ పోలవరం మండలం, ఇంటింటికి జనసేన పవన్ రావాలి పాలన మారాలి మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం ఐ. పోలవరం మండలం జి.వేమవరం పంచాయతీలో ఇంటింటికి పర్యటించిన పితాని . జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడి వరం నియోజకవర్గ ఇంచా ర్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం జి. వేమవరం పంచా యితీలోగల చి న్న కొడప, పెద్ద కొడప, రామదాసుతూము, కురసాలవారి సెంటర్ నందు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ మేని ఫెస్టో కరపత్రాలను పంచి గాజు గ్లాస్ పై ఓటు వేసి బాలకృష్ణ గారిని గెలిపించాలని కోరారు. భారతరత్న డాక్టర్ బి .ఆర్ అంబేద్కర్ గారికి పూలమాల అలంకరించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు గ్రామ అవసరాలైన మంచి నీటి సదుపాయం, ఇంటింటికి కుళాయిలు వాటర్ ట్యాంక్ లోపాలు అన్నీ కచ్చితంగా మా అధ్యక్షులు పవన్ కళ్యా ణ్ గారి ప్రభుత్వంలో చేసి పెడతా మని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా జి. మూలపాలెం గ్రామానికి చెందిన వైయస్సార్సీపి, తెలుగుదేశం నుండి వైసీపీ మెంబర్ గోడ ధనరాజు, గుర్రాలలోవరాజు, జెల్లి ఈశ్వర్, పళ్ళ సత్తి బాబు, తానింకి శ్రీనివాసరావు మొదలగు 20 మంది జనసేన పార్టీ విధానాలు నచ్చి జనసేన పార్టీలో పితాని బాలకృష్ణ గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు, జిల్లా కార్యవర్గసభ్యులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యుభు్యలు, గ్రామ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.