పార్వతీపురం, అంగన్వాడీ వర్కర్ల నిరసన సమ్మెకి మద్దతుగా నిరసనలో జనసేన పార్టీ పార్వతీపురం జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు ఆదాడ మోహన్ రావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్లకి కనీస వేతనం పెంచాలని, ఈ ప్రభుత్వానికి అంగన్వాడి వర్కర్లు అంటేచిన్న చూపని వాళ్లని ప్రభుత్వం గుర్తించలేదని రియల్ ఎస్టేట్, అక్రమ అరెస్టులపై ఉన్న శ్రద్ధ అంగన్వాడి వర్క ర్లపై లేదని చెప్పడం జరిగింది.