- అమరజీవి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి
- వైసీపీ నాయకులు శ్రీ పొట్టి శ్రీరాము లు స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు
‘అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాము లు గారి ఆత్మార్పణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆయన చేసిన త్యాగం వల్లే ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నా మని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం తెనా లి నియోజకవర్గం లోని బోస్ రోడ్డు లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం శ్రీ పొట్టి శ్రీరాములు గారు 56 రోజులుపాటు నిరాహార దీక్ష చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ ని సాధిం చారు. పొట్టి శ్రీరాములు వంటి కార్య దీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే దేశానికి స్వతంత్రం సాధిం చవచ్చు నని జాతిపిత మహాత్మా గాం ధీజీ అనేవారు అంటే ఆయన పోరాటపటిమ ఏపాటిదో మనం అర్ధం చేసుకోవచ్చు .
మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలని శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేస్తే .. వైసీపీ నాయకులు ఆయన స్ఫూర్తికి తూట్లు పొడుస్ తున్నారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. అన్ని వర్గాలు కష్టాలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్య మంత్రికి పాలనపై పట్టులే కపోవడంతో యువత, మహిళలు, పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యం గా చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునరకిం తమై , అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిగా ముందుగా తీసుకెళ్లిన రోజే ఆయనకు నిజంగా నివాళి అర్పించినట్లు. వైసీపీలా దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడకుం డా చక్కటిపాలన అందించే పాలకుల అవసరం రాష్ట్రానికి ఉంది. శ్రీ చంద్రబాబు నా యుడు గారు బెయిల్ మీద విడుదల కావడం హర్షిం చదగ్గ పరిణామం. శ్రీ పవన్ కళ్యా ణ్ గారి ఆశయ బలం, శ్రీ చంద్రబాబు గారి అనుభవంతో కూడిన ప్రభుత్వమే రాబోతుంది. శ్రీ పొట్టి శ్రీ రాములు గారి ఆశయాలను ముం దుకు తీసుకెళ్లే బాధ్య త తీసుకుంటాం ” అని అన్నా రు. ఈ కార్య క్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్య దర్ శి శ్రీ బండారు రవికాం త్, జిల్లా ఉపాధ్య క్షులు శ్రీ ఇస్మా యిల్ బేగ్, రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్య దర్ శి శ్రీ సాధు ప్రతాప్, జనసేన నా యకులు శ్రీ పసుపులేటి మురళీకృష్ణ, శ్రీ షేక్ జాకీర్ హుస్సే న్, శ్రీ హరిదాసు గౌరీ శంకర్, శ్రీ దివ్వె ల మధుబాబు, శ్రీ కొత్త రామారావు, శ్రీ కోట పున్నా రావు, సర్పంచు లు శ్రీ పాలడుగు రవీంద్ర, శ్రీమతి చొప్పర ప్రీతి, ఎంపీటీసీలు శ్రీ అమ్మి శెట్టి హరికృష్ణ, శ్రీమతి పసుపులే టి వెం కట నరసమ్మ , శ్రీమతి తిన్న లూరి విజయలక్ష్మి, శ్రీమతి చట్టు వెం కటేశ్వరి, శ్రీమతి మల్లి కా షేక్, శ్రీ చదలవాడ వే ణుమా ధవ్, శ్రీ గుం టూరు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నా రు.