రాజోలు: మనం చనిపోయాక మన శరీరం మట్టి లో వృదా కాకుండా మన శరీరంలో కొన్ని అవయవాలు ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొందరికి ఉపయోగపడే గొప్ప కార్యక్రమమే ఈ అవయవ దానం. బ్రతికే నాలుగు రోజులు మంచిగా బ్రతికి ఆ తర్వాత నిస్వార్థంగా ఎదుటి వారికి ఉపయోగపడాలని జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు గారి ప్రోత్సా హంతో శుక్రవారం రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం
అప్పనారామునిలంక గ్రామానికి చెందిన రాపాక మహేష్ అవయవదానం చేయడానికి
నిర్ణయించుకుని జీవన్ దాన్ ఆంధ్ర ప్రదేశ్ వైబ్ సైట్ లో అవయవదానం చేయడం కోసం
రిజిస్టర్ చేసుకోవడం జరిగింది.