రాజానగరం: కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామంలో బ్రమ్మలింగం చెరువు వద్దగల బొడమురు ఆంజనేయులు గారి పాక కరెంట్ షార్ట్ సర్ క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమై పోయింది. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. “మట్టి కుండలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలు నేడు జరిగిన అగ్ని ప్రమాదం వలన పూర్తిగా నిరాశ్రయులు అయ్యారని.. సమయానికి ఫైర్ ఇంజిన్ రాకపోవడం వలన పెను ప్రమాదం జరిగిందని… వారం రోజుల్లో ఇది రెండో సంఘటన అని ఇప్పటి కైనా అధికారులు స్పందించాలని తెలియజేసారు .
అగ్ని ప్రమాదం వలన జీవనోపాధి కోల్పోయిన బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని… జనసేన పార్టీ తరపున ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు .