నెల్లూరు: పాటూరు, కోవూరు నియోజకవర్గంలో నరాలశెట్టి మహేష్ జనసేనకు మద్దతుగా వైసిపి వారికి కౌంటర్ ప్రెస్ మీట్ ఇచ్చిన కారణంగా వైసిపి నాయకులు అతనిపై దాడి చేయడమే కాకుండా మహేష్ పై కేసు పెట్టడానికి ప్రయత్నించడానిని తెలుసుకొని. జనసేన పార్టీ కోవూరు మండల ప్రెసిడెంట్ అల్తాఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు సుధీర్ బద్ది పూడి, కే.ఎస్.ఎస్ వర్కింగ్ ఇన్చార్జ్ సుధా మాధవ్ మరియూ జనసైనికులతో కోవూరు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి దుర్భాషలాడింది, దాడికి దిగింది వైసీపీ నాయకులేనని గ్రామస్తులను విచారించి తగు చర్యలు తీసుకోవాలని అక్రమంగా కేసు పెట్టిన యెడల మేము ఇచ్చిన కేసు కూడా తీసుకోవాలని సిఐ గారిని కోరడం జరిగింది. అధికార పార్టీ ఒత్తిడితో మహేష్ మీద అక్రమంగా చేసి బనాయిస్తే జనసైనికులతో పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలుపవలసిందిగా జనసైనికులకు పిలుపునిచ్చారు.