అమెరికాలో మేధో సంక్షోభం: అదృశ్యమైన 10 మంది కీలక శాస్త్రవేత్తలు

అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత రహస్య పరిశోధనల్లో నిమగ్నమైన 10 మంది శాస్త్రవేత్తలు అదృశ్యమవడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. అణు, అంతరిక్ష, హైపర్‌సోనిక్ క్షిపణులు, క్వాంటం కంప్యూటింగ్ వంటి కీలక రంగాల్లో పనిచేస్తున్న ఈ శాస్త్రవేత్తలు సాధారణ వ్యక్తులు కాదని అధికారులు చెబుతున్నారు.

శబ్ద వేగం కంటే పలుమార్లు వేగంగా ప్రయాణించే హైపర్‌సోనిక్ మిస్సైల్ టెక్నాలజీ, భవిష్యత్ యుద్ధ వ్యూహాలను మార్చగల క్వాంటం కంప్యూటింగ్, అణు ఆయుధాల నిర్మాణం మరియు భద్రతకు సంబంధించిన రహస్య అంశాల్లో వీరికి ప్రత్యేక నైపుణ్యం ఉంది.

ఈ ఘటనపై వైట్ హౌస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కరోలిన్ లెవిట్ దీనిని అత్యంత తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. వెంటనే ఎఫ్‌బీఐ, సీఐఏ వంటి సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి.

శాస్త్రవేత్తలతో పాటు కీలక డిజిటల్ సమాచారం కూడా లీక్ అయి ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ కేసును సాధారణ మిస్సింగ్ కేసుగా కాకుండా జాతీయ భద్రతకు ముప్పుగా అమెరికా ప్రభుత్వం పరిగణిస్తోంది.

చైనా వంటి దేశాలు మేధావులను ఆకర్షించడం ద్వారా సాంకేతిక ఆధిపత్యం సాధించాలనే ప్రయత్నాలు చేస్తుండగా, రష్యా కూడా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రతీకార చర్యలకు దిగినట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ‘మేధో యుద్ధం’ ముదురుతోందనే సంకేతాలను ఇస్తోంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.